రాజ్ నిడిమోరు భార్య షాకింగ్ కామెంట్స్

స‌మంత రుత్ ప్ర‌భుతో ప్రేమాయ‌ణం

 

సినిమా రంగంలో శాశ్వ‌త బంధాలు ఉండ‌వు. ఉన్నా అవి పెటాకులు కావ‌డం ఖాయం. ఆయా పాత్ర‌ల‌లో న‌టించిన విధంగానే న‌టీ న‌టులు మారి పోవడం విచిత్రం. కొన్ని జంట‌లు త‌ప్ప చాలా క‌పుల్స్ విడి పోవ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది. తాజాగా త‌మిళ సినీ రంగానికి చెందిన జ‌యం ర‌విపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది త‌న భార్య ఆర్తి ప్ర‌కాశ్. వీరికి ఇద్ద‌రు కొడుకులు. అయినా మ‌నోడు ఓ సింగ‌ర్ ప్రేమ‌లో ప‌డి పోయాడు. ఇద్ద‌రూ విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కారు.

ఇప్పుడు మ‌రో జంట హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు కాగా వెబ్ సీరీస్ తో ద‌ర్శ‌కుడిగా మారిన రాజ్ నిడిమోరు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం జోరందుకుంది. వీరు క‌లిసి తిరుమ‌ల‌కు వెళ్లారు. అక్క‌డ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ఆ త‌ర్వాత స‌మంత నిర్మాత‌గా మారింది. త‌ను శుభం పేరుతో సినిమా తీసింది. ఇది విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ఆశించిన దానికంటే వ‌సూళ్లు కూడా వ‌చ్చాయి. ఈ త‌రుణంలో స‌క్సెస్ సంద‌ర్బంగా రాజ్ నిడిమోరుతో క్లోజ్ గా ఉండేలా ఫోటోస్ దిగింది అందాల ముద్దుగుమ్మ‌. దీంతో ఈ ఇద్ద‌రు పెళ్లికి సిద్దం అవుతున్నార‌న్న టాక్ ఊపందుకుంది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై రాజ్ నిడిమోర్ భార్య శ్యామ‌లి దే స్పందించింది. త‌ను అలాంటి వాడు కాద‌ని పేర్కొంది. కానీ డేటింగ్ ను న‌మ్మేందుకు ఆస్కారం ఉందంటూ పేర్కొంది. మొత్తంగా త‌ను చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com