3 Roses Sensational :ఆహాలో 3 రోజెస్ హ‌ల్ చ‌ల్

వైవా ఈషా రెబ్బా కీ రోల్స్

3 Roses Sensational

3 Roses : తెలుగులోనూ ఓటీటీల హ‌వా కొన‌సాగుతోంది. యూట్యూబ్ పుణ్య‌మా అని సినిమాలు, వెబ్ సీరీస్, సీరియ‌ల్స్, ట్రైల‌ర్స్ , టీజ‌ర్స్ ఎప్ప‌టిక‌ప్పుడు చూసుకునే ఛాన్స్ ప్రేక్ష‌కుల‌కు, సినీ అభిమానుల‌కు ల‌భిస్తోంది. ఇక ఓటీల ప‌రంగా చూస్తే నెట్ ఫ్లిక్స్ , జీ5, అమెజాన్ ప్రైమ్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటిలో అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో విడుద‌ల‌వుతున్నాయి. మ‌రికొన్ని నేరుగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే కేవ‌లం ఒకే ఒక ఓటీటీ దుమ్ము రేపుతోంది.

3 Roses in Aha..

అదే ప్ర‌ముఖ నిర్మాత గీతా ఆర్ట్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ సార‌థ్యంలోని ఆహా సూప‌ర్ డూప‌ర్ ప్రోగ్రామ్స్ తో అల‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే దేశంలోనే ఓటీటీ ల ప‌రంగా అత్య‌ధిక రేటింగ్ క‌లిగిన షోగా నిలిచింది..ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాప‌బుల్ ప్రోగ్రాం. ఈ ఒక్క షో ను కోట్ల‌ల్లో చూస్తున్నారు. అత్య‌ధిక ఆదాయం కూడా దీనికే వ‌స్తోంది.

ఇదే స‌మ‌యంలో ఆహా ప్ర‌యోగాలు చేస్తూ వ‌స్తోంది. వెబ్ సీరీస్ ను నిర్మిస్తోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే స్ట్రీమింగ్ అయిన సీరీస్ 3 రోజెస్(3 Roses). ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు వైవా హ‌ర్ష‌, న‌టి ఈషా రెబ్బా. ఇప్ప‌టి వ‌ర‌కు 2 సీజ‌న్ అయి పోగా మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆహా టీం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీజ‌న్ 3 రెడీగా ఉంద‌ని , స్ట్రీమింగ్ కోసం సిద్దంగా ఉందంటూ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి స‌ర‌దాగా ఉన్న టీజ‌ర్ ను రిలీజ్ కూడా చేశారు. మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది దీనికి.

Also Read : Popular Actor Amitabh Bachchan :కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి షోకు బిగ్ బి హోస్ట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com