తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విస్మరించని పదం వంశీ. తను భావుకుడు, రచయిత , సంగీతకారుడు..ఆలోచనాపరుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తను తీసిన ప్రతి మూవీ దేనికదే ప్రత్యేకం. ఆయన తొలిసారగా పూర్తిగా సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఆ చిత్రమే అన్వేషణ. ఇందులో భానుప్రియ, కార్తీక్, కైకాల సత్య నారాయణ, శరత్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఇది పూర్తిగా అడవిలో జరిగే వరుస హత్యలను పరిశోధించేందుకు పక్షి శాస్త్రవేత్త, పోలీసు అధికారి పాత్రలు మనల్ని వెంటాడేలా చేస్తాయి. ఇది అద్భుతమైన ప్రయోగంగా సినీ విమర్శకులు పేర్కొన్నారు.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అన్వేషణకు సంగీతం అందించారు. అద్భుతమైన పాటలు ఇచ్చారు. అన్వేషణ స్క్రీన్‌ప్లే, ప్రదర్శనలు, సంగీతానికి సానుకూల సమీక్షలను అందుకుంది .కేవలం రూ. 15 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఏకంగా భారీ హిట్ గా నిలిచింది ఆ ఏడాదిలో. ఎందరికో పాఠంగా మిగిలి పోయేలా చేసింది ఈ చిత్రం. తెలుగు సినిమా రంగంలో అత్యుత్తమ థ్రిల్లర్ మూవీగా నిలిచి పోయేలా చేశాడు వంశీ. ఆయనతో మాట్లాడితే కాలం సరిపోదు. జీవితం ఇంత గొప్పగా ఉంటుందా అన్న అనుభూతి మనకు కలుగుతుంది.
వాణిజ్య పరంగా ఈ సినిమా సక్సెస్ అయ్యింది. 11 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1986లో తమిళంలోకి పాడుం పరవైగల్‌గా డబ్ చేశారు. అక్కడ కూడా హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ముందు 1982లో వంశీ మంచు పల్లకి తీశాడు. 1984లో సితార తీశాడు. ఇది కూడా సక్సెస్ అయ్యింది. తన మూడో చిత్రమే అన్వేషణ. వంశీ పసలపూడిలో డిటెక్టివ్ నవలల పట్ల తనకున్న తొలి ప్రేమ నుండి ప్రేరణ పొంది తీసిన సినిమానే ఇది.