Natural Star Nani: బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌ తో నేచురల్ స్టార్ నాని భేటీ !

బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌ తో నేచురల్ స్టార్ నాని భేటీ !

Hello Telugu - Natural Star Nani

Natural Star Nani: తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తోన్న గారెత్‌ విన్‌ ఓవెన్‌…. నేచురల్ స్టార్ నానితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని నాని(Natural Star Nani) నివాసానికి వెళ్లిన గారెత్‌ కొంత సమయం అతనితో గడిపారు. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. ‘నానితో సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉంది. తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్నా. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్‌ సంబంధాలు ఎలా బలోపేతం చేసుకోవచ్చో ఇద్దరం చర్చించుకున్నాం. ఆయన నటించిన ఏవైనా రెండు సినిమాలు చూడమని నాని కోరారు. ఏ చిత్రాలు చూడాలో నాకు చెప్పండి’ అంటూ నెటిజన్లను సలహా అడిగారు. దీనితో బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారెత్‌ విన్‌ ఓవెన్‌ కు నెటిజన్లు నాని సినిమాల లిస్ట్ ను కామెంట్ బాక్సుల్లో పెడుతున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హాయ్ నాన్న, దసరా సినిమాలతో పాటు నాని పాత సినిమాలను కూడా ఈ లిస్ట్ లో పెడుతున్నారు.

Natural Star Nani Comment

ఇక నాని సినిమాల విషయానికొస్తే… దసరా, హాయ్ నాన్న వరుస హిట్‌ లతో నాని ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు. ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘సరిపోదా శనివారం’ లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. ఇందులో నాని(Natural Star Nani) మాస్‌ లుక్‌ లో కనిపించనున్నారు. నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటించగా ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ‘బలగం’ సినిమాతో దర్శకుడుగా మంచి గుర్తింపు అందుకున్న వేణు దర్శకత్వంలోను నాని నటించనున్నట్లు టాక్‌.

Also Read : Janhvi Kapoor: మళ్ళీ ‘దేవర’ సెట్స్‌లోకి అడుగుపెట్టి జాన్వీ కపూర్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com