Heeramandi: సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’

సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’

Hello Telugu - Heeramandi

Heeramandi: భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ ఒకరు. ప్రేమ కథలు, యాక్షన్, ఎంటర్ టైనర్ ఇలా ఏ జానర్ అయినా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తారు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్‌. హమ్ దిల్ దే చుకే సనమ్, బ్లాక్ వంటి లవ్ అండ్ యాక్షన్ సినిమాలతో పాటు దేవదాస్, పద్మావతి, గంగూభాయ్ కతివాడి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి ఎన్నో వాస్తవిక కథలను కళ్ళకు కట్టినట్లు చూపించిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. అయితే మొదటి సారిగా ఈ దర్శకుడు తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ(Heeramandi): ది డైమండ్‌ బజార్‌’ తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమౌతున్నారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు.

Heeramandi Web Series

ప్రేమ, స్వేచ్ఛ ఈ రెండింటి కలయికలో రూపొందిన పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరీ, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భన్సాలీతో పాటు విభు పూరి, మితాక్షర కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన ఈ అందాల తారల ఫస్ట్‌ లుక్‌ కు అభిమానులు ఫిదా అయిపోయారు. దీనితో ఈ వెబ్ సిరీస్ ను మే 1న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. దీనితో మరోసారి ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే డైమండ్‌ బజార్‌ లో మెరిసే ఆ ఆరుగురి తారల జీవితాల గురించి తెలుసుకోవాలంటే మే వరకూ ఆగాల్సిందే.

Also Read : Sandeep Reddy Vanga : నిర్మాతగా మారనున్న యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com