Suriya Jyothika: పద్దెనిమిదేళ్ల తర్వాత జోడీగా వస్తున్న సూర్య-జ్యోతిక !

పద్దెనిమిదేళ్ల తర్వాత జోడీగా వస్తున్న సూర్య-జ్యోతిక !

Hello Telugu - Suriya Jyothika

Suriya Jyothika: ఆఫ్‌ స్క్రీన్‌, ఆన్‌ స్క్రీన్‌ లో హిట్‌ జోడీ అయిన సూర్య(Suriya), జ్యోతిక తమిళంలో ‘పూవెల్లం కేట్టుప్పార్‌’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి, మెప్పించారు. మళ్లీ వీరిద్దరిని తెరపై ఎప్పుడెప్పుడు జంటగా చూస్తామా అని ఎదురు చూస్తున్న సినీప్రియులకు వీరు తీపి కబురు వినిపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘బెంగుళూరు డేస్‌’ ఫేమ్‌ అంజలి మేనన్‌ దర్శకత్వంలో నటించడానికి వీరిద్దరూ ఓకే చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయముపై వీరిద్దరితో చర్చలు జరుపుతోంది చిత్రబృందం. త్వరలో దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సన్నిహితవర్గాలు తెలిపాయి. దాదాపు 18 ఏళ్ల తరవాత వీరిద్దరి కాంబినేషన్‌ లో వస్తోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Suriya Jyothika Movie Updates

సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీని తరువాత దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజుతో తన 44వ చిత్రాన్ని ప్రకటించారు. దీని చిత్రీకరణను జూన్‌లో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త విషయాల్ని ప్రకటించారు. ‘సైంధవ్‌’ ఫేమ్‌ సంతోష్‌ నారాయణన్‌ ఈ సినిమా సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్‌ వార్‌ అండ్‌ లవ్‌ నేపథ్యంలో దీన్ని తీర్చిద్దుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమా విడుదల కానుంది

Also Read : Priyanka Chopra: ‘టైగర్‌’ కు డబ్బింగ్ చెప్పిన ప్రియాంక చోప్రా !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com