Harom Hara: మహేష్ బాబు చేతుల మీదుగా ‘హరోం హర’ ట్రైలర్ విడుదల !

మహేష్ బాబు చేతుల మీదుగా ‘హరోం హర’ ట్రైలర్ విడుదల !

Hello Telugu - Harom Hara

Harom Hara: యంగ్ హీరో సుధీర్ బాబు, మాళవిక శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘హరోం హర’. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్‌ జి.నాయుడు గ్రాండ్‌ గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ కి ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్‌ ముఖ్య పాత్ర పోషించగా… చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నటుడు కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలవలన ఈ సినిమా జూన్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Harom Hara Trailer Release

అయితే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్ బాబు చేతుల మీదుగా సోషల్ మీడియా వేదికగా ‘హరోం హర(Harom Hara)’ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్‌ ని విడుదల చేస్తూ… ‘‘హరోం హర స్క్రీన్‌ పైకి ఏం తీసుకువస్తుందో చూడాలని ఎదురు చూస్తున్నాను. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సుధీర్‌బాబు అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు’’ అని పోస్ట్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… ఆయుధాల ప్రాముఖ్యత గురించి సునీల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్‌ తో ఈ ట్రైలర్ మొదలైంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989 నాటి కథ ఇది. జీవితంలో ఎలాంటి పురోగతి లేని, సంతృప్తి చెందని సుబ్రహ్మణ్యంకు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. గన్స్ దొరకనప్పుడు అతను గన్ స్మిత్ అవుతాడు. సిటీలో హింసాత్మక ఘటనలు పెరగడంతో పోలీసులు గన్ స్మిత్ వెంట పడతారు. ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎంగేజింగ్‌గా ఉంది. జ్ఞానసాగర్ ద్వారక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. గన్ మేకింగ్ కాన్సెప్ట్ టాలీవుడ్‌ కి కొత్త. ఆయన రైటింగ్‌ లో కొత్తదనం కనిపిస్తోంది. డైలాగ్స్ కూడా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. సుధీర్ బాబు(Sudheer Babu) తన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. కుప్పం యాసలో, డైలాగ్ డెలివరీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ట్రైలర్‌కు బిగ్గెస్ట్ అసెట్స్. సునీల్‌ పాత్ర కూడా హైలెట్ అనేలా ఉంది. ఓవరాల్‌గా చూస్తే… ‘హరోం హర’ మరో ‘పుష్ప’ని తలపిస్తోంది.

టెక్నికల్‌ గా కూడా ట్రైలర్ చాలా బ్రిలియంట్‌ గా వుంది. అరవింద్ విశ్వనాథన్ క్యాప్చర్ చేసిన విజువల్స్, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఇచ్చిన ఎలివేషన్స్ సినిమాపై క్రేజ్‌కి కారణమవుతున్నాయి. SSC బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్-క్లాస్‌లో వున్నాయి. టీజర్, పాటలు, ఇతర ప్రమోషన్‌లు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పగా, ట్రైలర్ అంచనాలని రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్. భారీ అంచనాలతో జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Weapon: ఆసక్తికరంగా సత్యరాజ్‌ ‘వెపన్‌’ ట్రైలర్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com