Malavika Mohanan : తమిళస్టార్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని విజయం అందుకుంది. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్ ఆరతి పాత్రలో నటించింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ‘రాజాసాబ్’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించనున్నట్లు చెప్పారు. ప్రభాస్ అందరికీ డార్లింగ్ అని.. కచ్చితంగా ఈ చిత్రం హిట్ అవుతుందని దీమా వ్యక్తం చేశారు.
Malavika Mohanan Comment
‘’తంగలాన్’లో విక్రమ్‌గారితో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన గొప్ప నటుడు. ఈ సినిమా షూటింగ్ రోజులను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి విభిన్నమైన, బలమైన పాత్రలను తెరకెక్కించడం సాహసం. ఈ చిత్రం ఆగస్టు 30న బాలీవుడ్‌లో రిలీజ్ కానుంది. ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని గొప్పగా చిత్రీకరించడానికి టీమ్ ఎంతో కష్టపడింది. ఆ కష్టాన్ని హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకముంది’ అని అన్నారు.
Also Read : Hero Chiyaan Vikram : ‘తంగలాన్’ సీక్వెల్ పై స్పందించిన హీరో విక్రమ్