Ramam Raghavam : నిర్మాత దిల్ రాజునూ కంటతడి పెట్టించిన ‘రామం రాఘవం’ సినిమా

ధన్ రాజ్ డైరెక్ట్ చేసిన ‘రామం రాఘవం’ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు కోసం ప్రీమియర్ ప్రదర్శించారు...

Hello Telugu - Ramam Raghavam

Ramam Raghavam : తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా మంచి సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రామం రాఘవం(Ramam Raghavam)’. నటుడు, కమెడియన్ ధనరాజ్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని తండ్రిగా, ధనరాజ్ కొడుకుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు వీళ్ళిద్దరే కావడం విశేషం. అక్టోబర్ 2న ఈ సినిమా చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రీమియర్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 2500 మంది ఖైదీలు ఈ సినిమాను చూసి భావోద్వేగానికి గురైనట్లుగా చిత్ర బృందం పేర్కొంది. ఇప్పుడీ సినిమాను ప్రత్యేకంగా చూసిన దిల్ రాజు కూడా భావోద్వేగానికి లోనైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది.

Ramam Raghavam Movie Updates..

ధన్ రాజ్ డైరెక్ట్ చేసిన ‘రామం రాఘవం(Ramam Raghavam)’ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు కోసం ప్రీమియర్ ప్రదర్శించారు. ఆయన ఒక్కడే కూర్చుని ఈ సినిమా మొత్తం చూశారని, రెండు మూడు చోట్ల కంటతడి పెట్టుకున్నట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇంత బాగా ఈ సినిమాను తెరకెక్కించిన ధన్‌రాజ్‌‌పై దిల్ రాజు ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు వేణుతో ‘బలగం’ వంటి ఎమోషనల్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దిల్ రాజు.. ఇప్పుడు ధన్‌రాజ్ తెరకెక్కించిన ఈ ‘రామం రాఘవం’ చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

తమిళం, తెలుగు భాషల్లో తండ్రికొడుకుల ఎమోషనల్‌ జర్నీగా ‘రామం రాఘవం’ చిత్రాన్ని తెరకెక్కించారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు.

Also Read : Vishwak Sen : దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసి ఇలా రియాక్ట్ అయిన విశ్వక్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com