Ram Gopal Varma : విచారణకు కోర్టును వారం రోజులు గడువు కోరిన ఆర్జివి

వర్మను ప్రశ్నించేందుకు ప్రశ్నలను సిద్దం చేసుకున్నారు…..

Hello Telugu - Ram Gopal Varma

Ram Gopal Varma : చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెట్టారన్న కారణంగా ఈనెల 10వ తేదీన మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ(Ram Gopal Varma)పై నమోదైన కేసులో ఈరోజు ఒంగోలులో విచారణకు వర్మ గైర్హాజరయ్యారు… ఈ కేసులో ఈరోజు 19వ తేదీన విచారణకు హాజరుకావాలని వర్మకు మద్దిపాడు పోలీసులు ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చారు… మరోవైపు ఈ కేసు కొట్టి వేయాలంటూ హైకోర్టులో వర్మ వేసిన స్వ్యాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది… అవసరమైతే ముందస్తు బెయిల్‌ కోసం అప్పీలు చేసుకోవాలని సూచించింది… విచారణకు పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై సమయం అవసరమైతే విచారణ అధికారిని కోరవచ్చని హైకోర్టు పేర్కొంది… దీంతో ఈరోజు విచారణ కోసం ఒంగోలుకు రావాల్సిన వర్మ తనకు సమయం కావాలని కోరారు.

Ram Gopal Varma Letter to..

వర్మనువిచారించేందుకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసి రెడీగా ఉన్న పోలీసులకు ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో వర్మ(Ram Gopal Varma) నేరుగా విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్‌బాబుకు వాట్సప్‌ మెసేజ్‌ చేశారు… తనకు ముందుగానే ఏర్పాటుచేసుకున్న షూటింగ్‌ల కారణంగా నేడు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలని కోరారు… అలాగే ఒంగోలుకు చెందిన తన లాయర్‌ ఎన్‌. శ్రీనివాసరావును వ్యక్తిగతంగా సిఐను కలిసేందుకు పంపించారు… విచారణకు హజరయ్యేందుకు వారం రోజుల గడువు కోరుతూ వర్మ పంపించిన రిక్వెస్ట్‌ లెటర్‌ను ఆయన తరపు లాయర్‌ సిఐ శ్రీకాంత్‌కు అందించారు… వర్మ రిక్వెస్ట్‌ను పరిశీలించి చెబుతామని పోలీసులు తెలిపారు.

ప్రకాశంజిల్లామద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు… వర్మను ప్రశ్నించేందుకు ప్రశ్నలను సిద్దం చేసుకున్నారు… విచారణకు ఈనెల 19న మద్దిపాడు పియస్‌లో హాజరుకావాలంటూ ప్రకాశంజిల్లా పోలీసులు హైదరాబాద్‌ వెళ్ళి ఆయన నివాసంలో రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు హాజరుకాలేనని వర్మ పోలీసులకు విజ్ఞప్తి చేవారు… వారం రోజుల సమయం కావాలని కోరారు… వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్స్‌లో టిడిపి అధినేత చంద్రంబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై ఈనెల 10న ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Also Read : Ram Charan-RC16 : బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్ సి 16’ సినిమా నుంచి కీలక అప్డేట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com