Director Shankar : రామ్ చరణ్ స్క్రీన్ ప్రెసెన్స్ ను ప్రశంసించిన డైరెక్టర్ శంకర్

‘RRR రిలీజ్‌కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు...

Hello Telugu - Director Shankar

Director Shankar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో దర్శకుడు శంకర్(Director Shankar) కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి, ఆ పాత్రకు రామ్ చరణ్‌ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని శంకర్ వివరించారు.

Director Shankar Appreciates

‘RRR రిలీజ్‌కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్(Ram Charan) నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారు. నాకు కూడా అదే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. నా కథలు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. కాబట్టి ఓ పెద్ద హీరో అయిన బాగుంటుందని అనుకుని రామ్ చరణ్‌తో ప్రయాణం ప్రారంభించాం. రామ్ చరణ్‌ని చూస్తే.. లోలోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. టైం, సందర్భంగా వచ్చినప్పుడు ఆ శక్తి విస్పోటనం చెందుతుందా.? అన్నట్టుగా ఉంటుంది. డీప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారు’ అని తెలిపారు.

అవినీతిరాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ కనిపించున్నారు. టీజర్‌లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న రామ్ చరణ్‌ను చూపించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. రామ్ చరణ్‌తో పాటు గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ, ఎస్‌ జె సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని “జరగండి”, “రా మచ్చా”, “జానా హైరాన్ సా” పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. నాలుగో పాట అయిన డోప్ డిసెంబర్ 22న విడుదల కానుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన డోప్ ప్రోమో అందరినీ మెప్పించింది. థమన్ అద్భుతమైన సంగీతం, తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ, శంకర్ మేకింగ్‌తో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచేట్టుందని అంతా ఫిక్స్ అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read : Mowgli Movie : మరో నయా ప్రాజెక్ట్ తో సిద్దమైన యాంకర్ సుమ తనయుడు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com