Popular Heroine Madhuri Dixit : మాధురీ దీక్షిత్ ఎవ‌ర్ గ్రీన్ హీరోయిన్

బాలీవుడ్ లో ఇప్ప‌టికీ టాప్ హీరోయిన్

Popular Heroine Madhuri Dixit

Madhuri Dixit : తేజాబ్ మూవీతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది మాధురీ దీక్షిత్. 50 ఏళ్లు దాటినా ఇంకా న‌ట‌న‌తో అల‌రిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. అంతే కాదు డ్యాన్సుల‌తో హోరెత్తిస్తోంది. త‌ను కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొన‌సాగింది. బాలీవుడ్ లో త‌ను ఉన్నంత కాలం మిగ‌తా హీరోల‌ను డామినేట్ చేసింది. కేవ‌లం ప్రేక్ష‌కులు మాధురీ దీక్షిత్ ను చూసేందుకు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టిన దాఖ‌లాలు ఎన్నో. మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకించి సినీ రంగంలోకి రావాల‌ని అనుకున్న వాళ్లు త‌న‌ను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది.

Madhuri Dixit

మాధురీ దీక్షిత్(Madhuri Dixit) ను అభిమానులు ముద్దుగా ధ‌క్ ధ‌క్ గ‌ర్ల్ గా పిలుచుకుంటారు. ఇప్ప‌టికీ త‌న ఇమేజ్ అలాగే ఉంది. ఎక్క‌డా చెక్కు చెద‌ర‌లేదు. ఓ వైపు దిగ్గ‌జ తార‌లు రేఖ‌, హేమ‌మాలిని ఉన్నా వీరంద‌రినీ దాటుకుని త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. పెళ్లి చేసుకుని సెటిల్ అయినా త‌న అందం మాత్రం ఇంకా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. వెండి తెర‌పై ఎప్ప‌టికీ అందంతో మెస్మ‌రైజ్ చేస్తున్న న‌టీమ‌ణుల్లో రేఖ‌..మాధురి..హేమ మాలిని ఇప్ప‌టికీ ఆక‌ట్టుకుంటున్నారు.

ఆమె తన అద్భుతమైన నటనకు గాను నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. దీనితో పాటు, భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ కూడా ద‌క్కింది త‌న‌కు. మాధురి దీక్షిత్ 1965 మే 15న ముంబైలో జన్మించారు. డాక్ట‌ర్ కావాలని అనుకుంది న‌టిగా స్థిర ప‌డింది. ప్ర‌స్తుతం ఈవెంట్స్ షోలో పాల్గొంటోంది. న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. 1980 నుంచి 1990 ప‌దేళ్ల కాలంలో మాధురీ దీక్షిత్ నెంబ‌ర్ వ‌న్ గా కొన‌సాగింది. ఇది మామూలు విష‌యం కాదు. ఉమెన్స్ డే సంద‌ర్బంగా మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది న‌టి.

Also Read : Popular Actress Rekha : ఆత్మ విశ్వాసం అందానికి ప్ర‌తిరూపం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com