ఓ భామా అయ్యో రామా టీజ‌ర్

మాళ‌విక మ‌నోజ్..సుహాస్ న‌ట‌న

Hero Suhas-O Bhama Ayyo Rama

క్యాచీ టైటిల్ తో ముందుకు వ‌చ్చింది ఓ భామా అయ్యో రామా మూవీ టీజ‌ర్. ఇందులో సుహాస్ న‌టించాడు. త‌ను చిన్న చిన్న పాత్ర‌లు ధ‌రించాడు గ‌తంలో ప‌లు సినిమాల‌లో. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోగా ఈ సినిమా ద్వారా త‌న ల‌క్ ను ప‌రీక్షించుకునేందుకు వ‌చ్చేశాడు. అమ్మాయిల‌ను ఏ మాత్రం న‌మ్మ‌కండి అంటూ ఓ స్లోగ‌న్ తో రావ‌డం విశేషం. టీజ‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో చిత్రంపై బ‌జ్ పెరిగింది.

రామ్ గోధ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా న‌ల్లా హ‌రీష్ నిర్మించాడు. ఇందులో ప్ర‌ధాన నాయ‌కిగా న‌టిస్తోంది త‌మిళంలో మ‌ది అనే మూవీతో ఫేమ్ అయిన మాళ‌విక మ‌నోజ్ . తొలిసారిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది. దీంతో ఓ భామ అయ్యో రామ డిఫ‌రెంట్ క‌థ‌తో వ‌స్తోంద‌ని, ఇక్క‌డి వాతావ‌ర‌ణం బాగుందంటూ పేర్కొంది న‌టి. ఇందులో డేరింగ్ పాత్ర‌ను పోషిస్తోంది. ఇక భ‌య‌ప‌డుతూ ఉండే పాత్ర‌లో న‌టించాడు సుహాస్. ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ అనేది వ‌ర్క‌వుట్ అవుతుందా లేదా అనేది చిత్ర క‌థాంశం.

కామెడీ, ఎంట‌ర్ టైన‌ర్, స‌స్పెన్స్ తో తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. చిన్న పీట‌పై కూర్చుని సుహాస్ చెప్పే డైలాగ్ ఓ భామ అయ్యో రామా చిత్రానికి హైలెట్ గా నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో న‌టించిన అనుభ‌వం హీరోకు ప్ల‌స్ పాయింట్ కానుంది. ఈ వేస‌వి లోనే ప‌ల‌క‌రిచేందుకు వ‌స్తున్నాం అంటున్నారు. మ‌రి ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో లేదా అన్న‌ది ప్రేక్ష‌కులు నిర్ణ‌యిస్తారు. అంత దాకా వేచి ఉండ‌క త‌ప్ప‌దు మ‌రి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com