Beauty Sree Leela :శ్రీ‌లీల యాక్ట‌రే కాదు డాక్ట‌ర్ కూడా

ఇటీవ‌లే ఎంబీబీఎస్ కోర్సు పూర్తి

Beauty Sree Leela

Sree Leela : ఇదేమిటి యాక్ట‌ర్ శ్రీ‌లీల డాక్ట‌ర్ కావ‌డం ఏమిటి అనుకున్నారా. నిజ‌మే మీరు విన్న‌ది. సినిమాలలో ఎవ‌రైనా డాక్ట‌ర్ పాత్ర(Doctor) పోషిస్తారు. కానీ నిజ జీవితంలో ఈ అందాల ముద్దుగుమ్మ ఎంబీబీఎస్ కోర్సు కూడా పూర్తి చేసేసింది. స‌క్సెస్ ఫుల్ గా త‌ను పాస్ కూడా అయ్యింది. ఇంకేం ఓ వైపు యాక్ట‌ర్ గా ఫుల్ బిజీగా ఉన్న శ్రీ‌లీల(Sree Leela) ఇక నుంచి డాక్ట‌ర్ గా కూడా ప్రాక్టీస్ మొద‌లు పెట్ట‌వ‌చ్చ‌న్న‌మాట‌. కానీ డాక్ట‌ర్ గా ప‌ని చేస్తే కొన్నే డ‌బ్బులు వ‌స్తాయి. కానీ అదే ఒక్క మూవీ హిట్ అయితే చాలు కోట్ల‌ల్లో రెమ్యూన‌రేష‌న్ ద‌క్కుతుంది.

Sree Leela Got Appreciations

ఓ వైపు సినిమాల‌లో బిజీగా ఉంటూనే మ‌రో వైపు స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూనే ఇంకో వైపు డాక్ట‌ర్ కోర్సుపై పూర్తిగా శ్ర‌ద్ద పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. త‌న సినీ కెరీర్ విచిత్రంగా ప్రారంభ‌మైంది. క‌న్న‌డ సినీ రంగంలో కిస్ అనే మూవీతో 2019లో ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత మ‌రో చిత్రంలో న‌టించింది. తెలుగు తెర‌కు తీసుకు వ‌చ్చాడు కె. రాఘ‌వేంద్ర‌రావు. నటుడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ తో పెళ్లి సంద‌డి తీశాడు. స‌క్సెస్ అయ్యింది ఈ మూవీ. త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఏ హీరోయిన్ ను ప‌రిచ‌యం చేసినా ఆమె టాప్ లోకి వెళ్లి పోతుంద‌ని ప్ర‌చారం ఉంది. అందుకు అనుగుణంగానే శ్రీ‌లీల ఇవాళ జాతీయ స్థాయిలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇటు తెలుగులో అటు హిందీలో కూడా న‌టిస్తోంది. కార్తీక్ ఆర్య‌న్ తో క‌లిసి ఆషిఖీ3లో కీ రోల్ పోషిస్తోంది. త‌న‌తో డేటింగ్ కూడా చేస్తున్న‌ట్లు టాక్. ఇక తాజాగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన మూవీ పుష్ప‌2 . ఇది ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది. అత్య‌ధిక వ‌సూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇందులో శ్రీ‌లీల కిస్స‌క్ అంటూ స్పెష‌ల్ సాంగ్ ను చేసింది. ఇప్పుడు నితిన్ రెడ్డితో క‌లిసి రాబిన్ హుడ్ లో న‌టించింది. ఇవాళే రిలీజ్ అయ్యింది. మొత్తంగా యాక్ట‌ర్ డాక్ట‌ర్ కావ‌డం తో హ్యాపీగా ఉంది.

Also Read : Hero Salmaan Khan :అమ‌ర‌న్ ద‌ర్శ‌కుడితో స‌ల్మాన్ భాయ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com