Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంత కాలం బతుకుతానో చెప్పలేనంటూ వాపోయాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తను , రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం సికందర్ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్స్ విషయంలో విపరీతమైన సెక్యూరిటీ ఉండడంతో హాట్ టాపిక్ గా మారాడు హీరో. ఈ విషయంపై స్పందించాడు. ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బంది ఎదురవుతోందంటూ పేర్కొన్నాడు.
Salman Khan Comment
తను ప్రస్తుతం గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణ హానిని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే జింకను చంపిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు. ప్రత్యేకించి బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలతో ముంబై మాఫియాతో లింకులు ఉన్నట్లు విమర్శలు కూడా ఉన్నాయి. ఇది పక్కన పెడితే తన సికిందర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు. దీనిని ప్రతిష్టాత్మకంగా మురుగదాస్ తెరకెక్కించాడు.
తన సినిమా ప్రమోషన్ సందర్బంగా మీడియాతో మాట్లాడాడు సల్మాన్ ఖాన్. తనకు దేవుడి పట్ల నమ్మకం ఉందన్నాడు. ఆ అల్లాహ్ ఎప్పటి వరకు ఆశీర్వాదం ఉంటుందో అంత వరకు తాను ఇక్కడ ఉంటానని, లేదంటే ఉండనంటూ చెప్పాడు. అల్లాహ్ చూస్తున్నాడు..ఎవరికి ఎంత కాలం బతకాలని రాసి ఉంటుందో ..అంత కాలం జీవించాల్సిందే తప్ప కాలానికి ఎదురీదలేమని అన్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందన్నాడు. ఇల్లు లేదంటే షూటింగ్ ఉంటే అక్కడికి వెళుతున్నానని చెప్పాడు సల్మాన్ ఖాన్.
Also Read : Beauty Sree Leela :శ్రీలీల యాక్టరే కాదు డాక్టర్ కూడా
