Hero Jr NTR : తార‌క్ సెన్సేష‌న్ డైరెక్ట‌ర్స్ వైర‌ల్

సంచ‌ల‌నంగా మారిన ఎన్టీఆర్

Hero Jr NTR

Jr NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్ వైర‌ల్ గా మారారు. త‌ను ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో జ‌త క‌ట్టాడు. డ్రాగన్ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా కొన‌సాగుతోంది. ఓ వైపు కీల‌క స‌న్నివేశాల‌లో పాల్గొంటూనే మ‌రో వైపు ఈవెంట్స్ ల‌లో పాల్గొంటున్నాడు. ఈ మ‌ధ్య‌న మ్యాడ్ స‌క్సెస్ వేడుక‌కు హాజ‌ర‌య్యాడు. త‌న చిత్రం గురించి కూడా ప్ర‌స్తావించాడు. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే పాన్ ఇండియా ద‌ర్శ‌కుడితో చేస్తున్న చిత్రం కావ‌డంతో ఎక్క‌డ‌లేని బ‌జ్ వ‌స్తోంది.

Jr NTR – Directors..

త‌ను న‌టించిన దేవ‌ర సీక్వెల్ మూవీ కూడా రానుంది. తాజాగా తార‌క్ తో పాటు ద‌ర్శ‌కులు వైర‌ల్ గా మారారు. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్ తో పాటు ప్ర‌శాంత్ నీల్ క‌లిసి ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. సినిమా, వ్య‌క్తిగ‌త క‌బుర్లు చెప్పుకున్నారు. ఈ అరుదైన ఫోటోను సుకుమార్ స‌తీమ‌ణి త‌బితా సుకుమార్ షేర్ చేసింది. ఈ పార్టీ ఎవ‌రిద‌ని అనుకుంటున్నారా.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి భార్య మాలిని పుట్టిన రోజు సంద‌ర్బంగా భారీగా పార్టీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, పేరొందిన ద‌ర్శ‌కులు హాజ‌ర‌య్యారు. ఇందులో విశేషం అంటే జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr NTR) భార్య ప్ర‌ణీత‌, ప్ర‌శాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి, పైడిప‌ల్లి స‌తీమ‌ణి మాలిని క‌లిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే వంశీ పైడిపల్లి ఆ మ‌ధ్య‌న ద‌ళ‌ప‌తి విజ‌య్ తో తీశాడు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కు స్టోరీ వినిపించాడ‌ని , దానికి ఓకే కూడా చెప్పిన‌ట్లు స‌మాచారం.

Also Read : Hero Akhil Akkineni : డిఫ‌రెంట్ రోల్ లో అఖిల్ అక్కినేని

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com