Jawan Movie : యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు పరుగులు తీస్తోంది. ఇది ఓ రికార్డ్. ఇప్పటి వరకు సినీ చరిత్రలో జోసెఫ్ విజయ్ పేరు మీద ఉండేది. దానిని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చెరిపేశాడు.
Jawan Movie Record Collections
జవాన్ చిత్రాన్ని(Jawan Movie) బాద్ షా భార్య గౌరీ ఖాన్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏకంగా ఈ ఒక్క సినిమా కోసం రూ. 220 కోట్లు ఖర్చు చేసింది. రిచ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అట్లీ కుమార్. షారుక్ ఖాన్ తో పాటు నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు.
ఆకట్టుకునే సన్నివేశాలు, గగుర్పొడిచే పోరాటాలు, మనసు దోచుకునే పాటలు, గుండెల్ని తాకే డైలాగులు జవాన్ ను సక్సెస్ అయ్యేలా చేశాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యాజిక్ చేశాడు. యూట్యూబ్ ను ఇప్పటికీ అందించిన పాటలు షేక్ చేస్తున్నాయి.
మొత్తంగా కలెక్షన్ల పరంగా చూస్తే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది జవాన్. ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో రూ.1,000 కోట్లు కలెక్షన్స్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది. బాద్ షా తన అద్భుతమైన నటనతో తిరుగు లేదని నిరూపించారు.
Also Read : Amritha Aiyer Vs Dimple Hayathi