Tharun Moorthy Sensational : ఎవ‌రీ త‌రుణ్ మూర్తి ఏమిటా స్పెష‌ల్

సృజనాత్మ‌క ద‌ర్శ‌కుడిగా గుర్తింపు

Tharun Moorthy Sensational

Tharun Moorthy : మ‌ల‌యాళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో సాంకేతిక నిపుణులు ఎక్కువ‌. వాస్త‌వాల‌కు అద్దం పట్టేలా చిత్రాల‌ను నిర్మించ‌డం, తీయ‌డం ఇక్క‌డి వారికి ఇష్టం. ఎంతో మంది టాప్ డైరెక్ట‌ర్స్ తో పాటు న‌టీ న‌టులు కూడా వ‌చ్చారు. ఇంకా వ‌స్తూనే ఉన్నారు. అలాంటి వారిలో త‌రుణ్ మూర్తి ఒక‌డు. తన జ‌ర్నీ విల‌క్ష‌ణ‌మైన‌ది. అంత‌కు మించి ప్ర‌త్యేక‌మైన‌ది కూడా. ఆప‌రేష‌న్ జావా నుండి తుడారుమ్ దాకా అద్భుత‌మైన ప్ర‌యాణం చేశాడు. తాజాగా సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ తో తుడారుమ్ తీశాడు. ఏప్రిల్ 25 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సంద‌ర్బంగా త‌రుణ్ మూర్తి(Tharun Moorthy) వార్త‌ల్లో నిలిచాడు.

Director Tharun Moorthy Sensational in Malayam Industry

ఆయ‌న తీసే సినిమాల‌న్నీ సామాజిక అంశాలు, స‌మ‌స్య‌ల‌పై ఉంటాయి. వాటినే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతూ వ‌స్తున్నాడు. సినిమా అంటే వినోదం కాద‌ని దానికి సామాజిక ప్ర‌యోజ‌నం ఉండాల‌ని చెప్ప‌క‌నే చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు త‌రుణ్ మూర్తి. తుడారుమ్ రిలీజ్ కు ముందు న్యాయం, సామాజిక స‌మ‌స్య‌లు, రోజూవారీ పోరాటాల‌ను అన్వేషించేలా వాటిపై తెర‌పై ప్ర‌తిఫ‌లించేలా చూశాడు ద‌ర్శ‌కుడు. సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత 1990 త‌ర్వాత దిగ్గ‌జ జంట మ‌రోసారి ఈ మూవీ ద్వారా రానుండ‌డం విశేషం.

మోహ‌న్ లాల్ తో పాటు శోభ‌న కీల‌క పాత్ర‌లు పోషించారు తుడారుమ్ లో. 2021లో త‌రుణ్ మూర్తి జ‌ర్నీ ప్రారంభ‌మైంది. ఆప‌రేష‌న్ జావా తీశాడు. సౌదీ వెల్ల‌క్క వ‌చ్చింది. ఇది సైబ‌ర్ క్రైమ్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. సైబ‌ర్ నేర ప‌రిశోధ‌న‌ల వాస్త‌వాల‌ను చెప్పాడు. కేర‌ళ పోలీసుల నిజాయితీని ప్ర‌దర్శించేలా చూశాడు. బాధితుల‌ భావోద్వేగ, ఆర్థిక ఇబ్బందులను, మోసపోవడం వల్ల కలిగే కళంకాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు. సౌదీ వెల్ల‌క్క చిత్రంలో దేశంలోని న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఎక్కు పెట్టాడు.

Also Read : Director Karthik Shocking :రెట్రో క‌థ ర‌జ‌నీకాంత్ కోసం రాశా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com