Popular Actor Vadivelu :న‌వ్వుల న‌జ‌రానా గ్యాంగ‌ర్స్ థిల్లానా

అన్నీ తానై న‌డిపించిన వడివేలు

Popular Actor Vadivelu

Vadivelu : చాన్నాళ్ల త‌ర్వాత ఆహ్లాద‌క‌ర‌మైన ఇంటిల్లిపాది న‌వ్వుకునేలా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది గ్యాంగ‌ర్స్ మూవీ. ప్ర‌ముఖ త‌మిళ సినీ క‌మెడియ‌న్ వ‌డివేలు(Vadivelu) మ‌రోసారి త‌న స‌త్తా ఏపాటిదో చూపించాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే అన్నీ తానై వ్య‌వ‌హ‌రించాడు. కామెడీ ప‌రంగా త‌న‌కు వంద మార్కులు ప‌డ్డాయి. త‌ను గ‌నుక న‌టించ‌క పోయి ఉంటే ఈ సినిమా అంత‌గా ఆక‌ట్టుకునేది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. గ్యాంగ‌ర్స్ చిత్రానికి న‌వ్వుల హ‌రివిల్లు అంటూ పేరు కూడా పెట్టేశారు సినీ విమ‌ర్శ‌కులు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Popular Actor Vadivelu Gangers Movie Updates

హ‌స్యభ‌రిత‌మైన గెట‌ప్ లు ఇందులో క‌నువిందు చేస్తాయి. సుంద‌ర్ సి గ్యాంగ‌ర్స్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఇష్టంగా మారి పోయింది. అంతే కాదు వడివేలు న‌వ్వుల అల్ల‌ర్ల‌కు కేరాఫ్ గా మారి పోయాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అభిమానుల‌కు నోస్టాల్జిక్ గా , న‌వ్వులతో ముంచెత్తేలా చేశాడు.
చాలా గ్యాప్ తీసుకున్నాడు క‌మెడియ‌న్. త‌ను భిన్న‌మైన పాత్ర‌ల‌ను గ‌తంలో ఎన్నో పోషించాడు. హాస్య పాత్ర‌లో కాకుండా క‌థ‌నంలో కేంద్ర శ‌క్తిగా తెర‌పై క‌నిపించాడు. కామెడీ ఐకాన్ గా పేరు పొందాడు.

త‌నను మ‌రోసారి అద్భుతంగా తెర మీద ప్ర‌జెంట్ చేశాడు ద‌ర్శ‌కుడు సి. సుంద‌ర్. గ‌తంలో త‌ను విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన చ‌రిత్ర ఉంది. గ్యాంగ‌ర్స్ ను చూసిన ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. చాన్నాళ్ల త‌ర్వాత ఫీల్ గుడ్ మూవీ వ‌చ్చిందంటూ పేర్కొంటున్నారు. క్లీన్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఇప్ప‌టికే టాక్ తెచ్చుకుంది గ్యాంగ‌ర్స్. డ‌బుల్ మీనింగ్ డైలాగ్ లు లేవు. జుగుస్సాక‌ర‌మైన సీన్స్ కు దూరంగా ఉంచాడు డైరెక్ట‌ర్. మొత్తంగా ఇది వ‌డివేలు కోసం చూడాల్సిన సినిమా. వీలైతే చూసేందుకు ప్ర‌య‌త్నం చేయండి.

Also Read : Tharun Moorthy Sensational : ఎవ‌రీ త‌రుణ్ మూర్తి ఏమిటా స్పెష‌ల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com