AR Rahman : దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టి అంతా సంగీతంపైనే ఉంటుందన్నాడు. ఇతరులు చేసే విమర్శలు, ఆరోపణలను తాను పట్టించుకోనని, అంత టైం తనకంటూ ఉండదని పేర్కొన్నాడు. ఈ సందర్బంగా తను కొంత కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. పిల్లలు కూడా. అయితే ఉన్నట్టుండి అందరినీ విస్తు పోయేలా చేశాడు ఏఆర్ రెహమాన్(AR Rahman). చాలా సౌమ్యంగా ఉండే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తమ 29 ఏళ్లు సుదీర్ఘ వివాహ బంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు తన భార్య కూడా ఇదే విషయాన్ని తెలిపింది.
AR Rahman Shocking Comments
తామిద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటూనే కోర్టుకు ఎక్కారు భార్య భర్తలు. తమకు తక్షణమే విడాకులు మంజూరు చేయాలని కోరారు. కోర్టును ఆశ్రయించారు. ఈ ఇద్దరికీ ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇదే సమయంలో పిల్లలు అయ్యాక కూడా నీకు ఎందుకు విడాకులంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ను. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా చేస్తారని తాము అనుకోలేదంటూ మరికొందరు సినీ, కళాభిమానులు ప్రశ్నిస్తున్నారు నేరుగా ఏఆర్ రెహమాన్ ను.
ఈ సందర్బంగా తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని, సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రోల్స్ గురించి స్పందించాడు తొలిసారిగా మ్యూజిక్ డైరెక్టర్. సినిమా రంగం అనేది ప్రత్యేకమైనది. ఇందులో ఎవరు ఎప్పుడు కలుస్తారో విడి పోతారో చెప్పలేం. ప్రత్యేకించి సినీ రంగానికి చెందిన వారు, సెలెబ్రిటీలు ఏం చేస్తుంటారోనని తెలుసు కోవాలనే ఉత్సుకత ఉంటుందని , ఇది సహజమేనని పేర్కొన్నారు. అయితే తన గురించి తప్పుగా మాట్లాడే వారు, విమర్శలు చేసే వారి గురించి తాను చెడుగా మాట్లాడ బోనంటూ పేర్కొన్నాడు. వారంతా తన కుటుంబీకులుగానే భావిస్తానని చెప్పారు అల్లా రఖా రెహమాన్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Sarangapani Jathakam Sensational :ఆకట్టుకున్న సారంగపాణి జాతకం
