Dethadi Movie Sensational :చారిత్రాక‌ నేప‌థ్యం దేత్త‌డి చిత్రం 

60వ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన దిల్ రాజు 

Dethadi : టాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు. ఈ ఏడాది త‌ను నిర్మించిన రెండు సినిమాలు తీశాడు. ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ కాగా మ‌రోటి బొక్క బోర్లా ప‌డింది. స్టార్ హీరో ఉన్నా ప్రేక్ష‌కులు ప‌క్క‌న ప‌డేశారు. కంటెంట్ బాగా ఉంటేనే ఆదరిస్తామ‌ని, లేక పోతే చిరంజీవి అయినా ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ న‌టించినా డోంట్ కేర్ అని తిర‌స్క‌రించారు. దేశం గ‌ర్వించ ద‌గిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

Dethadi Movie Updates

ఇదే స‌మ‌యంలో దిల్ రాజు(Dil Raju) నిర్మించిన మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. వ‌య‌సు మీద ప‌డినా ఎక్క‌డా త‌గ్గ‌కుండా యంగ్ హీరో, హీరోయిన్ల‌తో పోటీ ప‌డి న‌టిస్తున్నారు విక్ట‌రీ వెంక‌టేశ్. ఇందులో ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆంధ్రాకు చెందిన బుడ్డోడు బుల్లిరాజు పాత్ర సూప‌ర్.  ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది. వెంకీ సినీ కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచి పోయింది.

తాజాగా దిల్ రాజు కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. తెలంగాణ సాంస్కృతిక వార‌స‌త్వం, చ‌రిత్ర‌కు సంబంధించి దేత్త‌డి మూవీని తీస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ చిత్రాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మించ‌నుంది. ఇది 60వ సినిమా. ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు రౌడీ బాయ్స్ , ల‌వ్ మీ మూవీస్ ఫేమ్ ఆశిష్ దేత్త‌డిలో న‌టిస్తున్నాడు. దీనిని హై ఎనర్జీ ఎంట‌ర్ టైన్ మెంట్ గా రూపొందనున్నాడు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో స్ట్రీట్ డ్ర‌మ్మ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకు ఆదిత్య రావు గంగ‌సాని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు.

Also Read : Hero Allu Arjun-Chiranjeevi :మెగాస్టార్ ప్ర‌భావం స‌క్సెస్ కు సోపానం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com