Hit 3 : టాలీవుడ్ లో కొత్త దర్శకులకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. కథ బాగుంటే మూవీస్ తప్పకుండా ఆడుతాయని, కలెక్షన్స్ రావడం పక్కా అని నిరూపిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రత్యేకించి దర్శకుడు శైలేష్ కొలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. తను తాజాగా డిఫరెంట్ స్టోరీతో నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి కీ రోల్స్ లో హిట్ -3 మూవీని రూపొందించాడు. ఇది బిగ్ సక్సెస్ అయ్యింది.
Hit 3 Movie Success
ఇప్పటి దాకా నాని నటుడిగానే కాదు నిర్మాతగా ప్రారంభించాడు. తను నిర్మించిన కోర్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. భారీ కలెక్షన్స్ సాధించింది. ఏకంగా రూ. 130 కోట్లు వసూలు చేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏకంగా రూ. 8 కోట్లకు అమ్ముడు పోయింది. ఇక సినిమా విషయానికి వస్తే నాని నటించిన హిట్ 3 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఏకంగా మూడు రోజుల్లోనే రూ. 35 కోట్లు వసూలు చేసింది.
ఇక హిట్ -3(Hit 3) మూవీలో నానిని పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇచ్చాడు. ఇందులో వంద శాతం న్యాయం చేశాడు. ఈ కేరెక్టర్ కు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది ప్రేక్షకుల నుంచి . అయితే వయెలెన్స్ ఎక్కువగా ఉందన్న టాక్ వచ్చింది. మూవీ బిగ్ సక్సెస్ కావడంతో స్పందించాడు దర్శకుడు శైలేష్ కొలను. హిట్ -3ని ఇంతగా ఆదరిస్తారని తాను అనుకోలేదన్నాడు. పూర్తి హింసాత్మకంగా తీసినా మహిళలు ఆదరించడం తమ సినిమా పట్ల వారికి ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తుందన్నాడు.
Also Read : Natural Star Nani-Hit 3 :హిట్ 3 బిగ్ సక్సెస్ రామ్ చరణ్ కంగ్రాట్స్