Hero Pawan-Hari Hara Veera Mallu :షూటింగ్ కంప్లీట్ రిలీజ్ కు రెడీ

ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు

Hero Pawan-Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu : ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ , నిధి అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. దీనిని ప్ర‌ముఖ నిర్మాత ఎంఎం ర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చాలా కాలం త‌ర్వాత రానుంది ప‌వ‌న్ మూవీ. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. త‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. ప్ర‌స్తుతం ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాజ‌కీయాల‌లో ఫుల్ టైం కేటాయించ‌డంతో త‌ను సినిమా షూటింగ్ కు ఆశించిన మేర టైమ్ ఇవ్వ‌లేక పోయాడు. అందుకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు(Hari Hara Veera Mallu) పూర్తి కాలేదు.

Hari Hara Veera Mallu Movie Release Updates

ఈ సినిమాకు ప్రారంభంలో ఉన్న ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి కృష్ ఉండ‌గా ఏమైందో ఏమో కానీ త‌ను త‌ప్పుకున్నాడు. ఆయ‌న తొలి భార్య‌ను వ‌దిలేశాడు. రెండో భార్య‌గా డాక్ట‌ర్ తో పెళ్లి చేసుకున్నాడు. దీంతో కృష్ స్థానంలో కొత్త ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ ఎంట‌ర్ అయ్యాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌డుతూ లేస్తూ వ‌చ్చింది. తాజాగా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీకి సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ , ట్రైల‌ర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌త‌హాగా పాట కూడా పాడారు. ఇది బిగ్ హిట్ అయ్యింది.

మ‌రో వైపు ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీని రెండు పార్టులుగా తీస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. తొలి పార్ట్ దాదాపు పూర్త‌యింద‌న్నాడు. కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నాలుగు రోజుల పాటు చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉంద‌న్నాడు. పాలిటిక్స్ లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల టైమ్ దొర‌క‌లేద‌న్నాడు. ఆదివారం షూటింగ్ కోసం రీ ఎంట్రీ ఇచ్చాడ‌న్నారు ద‌ర్శ‌కుడు .

Also Read : Hero Nithin-Thammudu :నితిన్ రెడ్డి త‌మ్ముడు రిలీజ్ డేట్ ఫిక్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com