Hero Naga Chaitanya :తండ్రి కాబోతున్న అక్కినేని నాగ‌చైత‌న్య‌..?

ఇటీవ‌లే శోభిత ధూళిపాళ‌తో వివాహం

Hero Naga Chaitanya

Naga Chaitanya : టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైతన్య(Naga Chaitanya) త్వ‌ర‌లో తండ్రి కాబోతున్నారా. అవున‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇటీవ‌లే త‌ను న‌టి శోభిత ధూళిపాళ‌ను పెళ్లి చేసుకున్నాడు. అంత‌కు ముందు తాను ఏమాయే చేశావే గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం చేసిన మూవీలో న‌టించిన నేష‌న‌ల్ స్టార్ హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భుతో పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం పాటు బాగున్నారు. ఆ త‌ర్వాత విడి పోతున్నామంటూ ప్ర‌క‌టించారు.

Naga Chaitanya to be a Father

ఎందుక‌నే విష‌యం మాత్రం బ‌య‌ట‌కు చెప్పలేదు. సినిమా రంగానికి చెందిన చాలా మంది హీరో హీరోయిన్లు స‌రిగా కాపురం చేసిన దాఖ‌లాలు లేవు. శోభిత‌ను పెళ్లి చేసుకుని 5 నెల‌లు కావస్తోంది. ఈ జంట క‌లిసి ఇటీవ‌లే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన వేవ్స్ స‌ద‌స్సులో త‌ళుక్కున మెరిశారు. భార‌తీయ సినీ రంగానికి చెందిన సినీ ప్ర‌ముఖులు ప్ర‌త్య‌క ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇందులో ర‌జ‌నీకాంత్ , అక్కినేని నాగార్జున‌, అల్లు అర్జున్ , అక్ష‌య్ కుమార్, దీపికా ప‌దుకొనే, మాధురీ దీక్షిత్, రేఖ‌, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ధానిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఇలాంటి కార్య‌క్ర‌మం చేప‌ట్టినందుకు సంతోషంగా ఉంద‌న్నారు న‌టి శ్రీ‌లీల‌. వీరితో పాటు శోభిత‌, నాగ‌చైత‌న్య క‌లిసి ఇక్క‌డికి రావ‌డం, ఆమె క‌డుపుతో ఉన్న‌ట్లు క‌నిపించ‌డంతో త‌ను గ‌ర్భం దాల్చిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఓ బిడ్డ‌కు ప్రాణం పోస్తుండ‌డంతో నాగ్ ఫ్యామిలీ తెగ ముచ్చ‌ట ప‌డుతోంది.

Also Read : Popular Singer Pawandeep Rajan :సింగ‌ర్ ప‌వ‌న్ దీప్ రాజ‌న్ కు ప్ర‌మాదం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com