Tourist Family Sensational Collections :రూ. 51 కోట్లు దాటేసిన టూరిస్ట్ ఫ్యామిలీ క‌లెక్ష‌న్స్

అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటున్న మూవీ

Tourist Family Sensational Collections

Tourist Family : క్రియేటివిటీకి పెట్టింది పేరు త‌మిళ సినీ ఇండస్ట్రీ. భిన్న‌మైన క‌థ‌ల‌తో ముందుకు వ‌స్తున్నారు. వీటిని ప్రోత్స‌హిస్తున్నారు నిర్మాత‌లు. అలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family). శ్రీ‌లంకలో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం కార‌ణంగా చోటు చేసుకున్న ఇబ్బందులు త‌ట్టుకోలేక ఓ కుటుంబం శ‌ర‌ణార్థిగా ఇక్క‌డ‌కు వ‌స్తుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన క‌థ‌నే అద్భుతంగా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు.

Tourist Family Movie Collections Sensational

కాన్సెప్ట్ కు త‌గిన‌ట్టుగా న‌టీ న‌టులు ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. తాజాగా ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే రిలీజ్ అయిన ఈ చిత్రం విచిత్రంగా కాసులు కురిపించేలా చేసింది. బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. త‌క్కువ బ‌డ్జెట్ తో త‌యారైన టూరిస్ట్ ఫ్యామిలీ అంద‌నంత ఎత్తులోకి వెళ్లి పోయింది.

బ‌ల‌మైన కంటెంట్ ఉంటే , సినిమాకు ప్ర‌మోష‌న్స్ అవ‌స‌రం లేద‌ని నిరూపించింది ఈ మూవీ. ఇది నిజంగా అభినందించ ద‌గిన అంశం అని చెప్ప‌క త‌ప్ప‌దు. పేరుకే చిన్న సినిమా అయినా బిగ్ మూవీస్ తో పోటీ ప‌డుతోంది. ఈ సినిమాలో ఆరోగ్య‌క‌ర‌మైన కామెడీతో పాటు స‌స్పెన్స్ కూడా కొన‌సాగించేలా తీశాడు ద‌ర్శ‌కుడు.

ఇదిలా ఉండ‌గా సినిమా నిర్మించేందుకు రూ. 14 కోట్లు ఖ‌ర్చు చేశారు. అయితే కేవ‌లం 14 రోజుల్లోనే టూరిస్ట్ ఫ్యామిలీ రూ. 51 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇందులో శ‌శి కుమార్ తో పాటు వ‌ర్ద‌మాన సీనియ‌ర్ న‌టి సిమ్రాన్ కీల‌క భూమిక పోషించారు. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కు బిగ్ స‌క్సెస్ సాధించ‌డం విశేషం.

Also Read : Metro Rail Phase 2 Sensational :రూ. 19,000 కోట్ల‌తో మెట్రో రైల్ ఫేజ్ -2

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com