రాజా సాబ్ ఎందుకింత ఆల‌స్యం..?

ద‌ర్శ‌కుడు మారుతిపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాజా సాబ్. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ వ‌స్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఏ ముహూర్తంన ప్రారంభించారో కానీ రెండు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెన‌క్కి అన్న రీతిలో కొన‌సాగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు మారుతి. ఇందులో ప్ర‌భాస్ తో పాటు నిధి అగ‌ర్వాల్, మాళ‌విక మోహ‌న్ కీ రోల్స్ పోషించారు.

ఇదే స‌మ‌యంలో దాదాపు 80 శాతానికి పైగా షూటింగ్ పూర్త‌యింద‌ని, ఇంకా కొన్ని కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ సాంగ్ ను చిత్రీక‌రించాల్సి ఉంద‌ని తెలిపాడు ద‌ర్శ‌కుడు. త‌ను వ‌చ్చాక షూటింగ్ లో పాల్గొంటాడ‌ని వెల్ల‌డించాడు. ఈ స‌మ‌యంలో త‌ను క‌ల్కి చిత్రం సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. ఫౌజీ కూడా ఉంది. అంతే కాకుండా ఇండియ‌న్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే స్పిరిట్ మూవీని క‌న్ ఫ‌ర్మ్ చేశాడు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించాడు వంగా.

దీంతో రాజా సాబ్ ప‌రిస్థితి ఏమిటి అనేది సందిగ్ధ‌త నెల‌కొంది. ఇక మారుతి విష‌యానికి వ‌స్తే తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ , క్రేజ్ క‌లిగిన ఏకైక న‌టుడు డార్లింగ్ ప్ర‌భాస్. మ‌రో వైపు హ‌నుమ రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రం కోసం ప్ర‌భాస్ సంత‌కం చేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది జోరుగా. మ‌రి రాజా సాబ్ ఇప్ప‌ట్లో వ‌స్తాడా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com