నేషనల్ లవ్లీ బ్యూటీ సమంత రుత్ ప్రభు ఇప్పుడు ఎనలేని సంతోషానికి లోనవుతోంది. దీనికి ప్రధాన కారణం తాను తొలిసారిగా నిర్మించిన చిత్రం శుభం అద్భుతమైన టాక్ తో దూసుకు పోతోంది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తక్కువ బడ్జెట్ తో కామెడీ, సస్పెన్స్ ప్రధానంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సందర్బంగా శుభం చిత్రం విజయోత్సవ ఈవెంట్ ను నిర్వహించారు.
గతంలో ఎన్నడూ లేనంతగా కిల కిల నవ్వింది అందాల ముద్దుగుమ్మ సమంత రుత్ ప్రభు. తను అక్కినేని నాగార్జున తనయుడు , హీరో అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. కొంత కాలంపాటు బాగున్నారు. ఆ తర్వాత విడి పోయారు. తను మరో నటి శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. తను ప్రస్తుతం కడుపుతో ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇది పక్కన పెడితే సాయి పల్లవితో నటించిన చైతూ మూవీ తండేల్ సూపర్ హిట్ గా నిలిచింది. తనకు కూడా ఈ ఏడాది బిగ్ సక్సెస్ దక్కింది. మరో మూవీ లో బిజీగా ఉన్నాడు. ఇక సమంత రుత్ ప్రభు విషయానికి వస్తే తను ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమూరుతో డేటింగ్ చేస్తోందని పెద్ద ఎత్తున పుకారు, షికార్లు చేస్తున్నాయి. ఆల్ రెడీ తనకు పెళ్లయింది.
త్వరలో పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించింది రాజ్ నిడిమోరు భార్య శాలిని దివె. మొత్తంగా శుభం సక్సెస్ సమంత రుత్ ప్రభుకు మంచి టానిక్ ఇచ్చేలా చేసిందని చెప్పక తప్పదు.