ఓ వైపు సినిమాలు హల్ చల్ చేస్తుంటే ఇంకో వైపు వెబ్ సీరీస్ దుమ్ము రేపుతున్నాయి. ఇండియన్ సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్నటి దాకా హీరో హీరోయిన్లు సైతం వెబ్ సీరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. చేతి నిండా డబ్బులు సంపాదించాలని ఫోకస్ వేస్తున్నారు.
తాజాగా రానా దగ్గుబాటి, వెంకటేష్ కలిసి నటించిన వెబ్ సీరీస్ రానా నాయుడు. ఇందులో బూతు, రొమాన్స్ కొంచెం శ్రుతి మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ డోంట్ కేర్ అంటున్నారు. ఇక బూతు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భారత్ లో ఓటీటీల హవా కొనసాగుతోంది. వీటిలో సెక్స్ శ్రుతి మించుతోంది. తాజాగా రానా నాయుడు వెబ్ సీరీస్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.
తొలి సీజన్ సంచలనం సృష్టించింది. కొంత గ్యాప్ తర్వాత సీజన్ 2 రాబోతోంది. నాటకీయత, సస్పెన్స్ , యాక్షన్ తో తెరకెక్కించేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత 2023లో మొదటి సీజన్ రిలీజ్ అయ్యింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సంచలన ప్రకటన చేశారు నటుడు రానా దగ్గుబాటి. సీజన్ 2 రానా నాయుడు జూన్ 13న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
2వ సీజన్ లో రానా , విక్టరీ వెంకీ, అర్జున్ రాం పాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మారియో నటించారు.