జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ పై కొల్లు ర‌వీంద్ర క‌న్నెర్ర

ఉన్న‌తాధికారుల‌ను బెదిరిస్తే ఊరుకునేది లేదు

అమ‌రావ‌తి – మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. ఆయ‌న ఇంకా సీఎం ప‌ద‌విలోనే ఉన్నాన‌ని భ్ర‌మ‌లో ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. నోరు ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడితే ఊరుకునేది లేద‌న్నారు. ఇప్ప‌టికే కొంద‌రు అలా మాట్లాడి జైలు పాల‌య్యార‌ని గుర్తు చేశారు. అనేక కుంభకోణాలతో రాష్ట్ర పరువును రోడ్డున పడేశారు జ‌గ‌న్ రెడ్డి అంటూ మండిప‌డ్డారు. గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలు బయట పడుతుంటే బుకాయింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

అధికారులను భ‌యపెట్టేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక‌లు జారీ చేశారు. మచిలీపట్నంలో జరిగిన మినీ మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పని చేస్తున్న అధికారులను భ‌య పెట్టేలా మాట్లాడ‌టం త‌న‌కు త‌గ‌ద‌న్నారు. త‌న మాట తీరును మార్చుకోవాల‌ని సూచించారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విని నిర్వ‌హించిన జ‌గ‌న్ రెడ్డికి ఇంత‌కంటే ఎక్కువ చెప్ప‌లేమ‌న్నారు.

వైసీపీ నేతలు చేసిన పాపాలే సింహాలై వారిపాలిట శాపంగా మారుతున్నాయన్నారు. ఓబులాపురం గనుల కుంభకోణంలో గాలి జనార్థనరెడ్డికి శిక్ష పడిందంటే అది టీడీపీ చేసిన పోరాట ఫలితమే అని అన్నారు కొల్లు ర‌వీంద్ర‌.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com