హైదరాబాద్ – నిన్నటి దాకా బీఆర్ఎస్ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు కలిగిన పార్టీగా పేరుంది. ఎవరు ఔనన్నా కాదన్నా దమ్మున్న నాయకుడిగా పేరు పొందారు కేసీఆర్. మొదట ఉద్యమ సంస్థగా మొదలైంది. ఆ తర్వాత పక్కా రాజకీయ పార్టీగా మార్చేశారు అధినేత. 14 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పోరాటాలు, ఆందోళనలు చేపట్టారు. రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీ కారణంగా.
ఏ వ్యక్తినైతే వద్దని అనుకుని బయటకు పంపించాడే అదే వ్యక్తి తన ముందు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం మింగుడు పడలేదు కేసీఆర్ కు. ఆ తర్వాత వరుసగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెల మెల్లగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరంగా వైఫల్యం చెందడం ఒకింత ప్లస్ పాయింట్ గా మారింది. ఈ తరుణంలో ప్రధానమైన ప్రతిపక్షంగా తన పాత్రను పోషిస్తూ వస్తోంది బీఆర్ఎస్. ఈ సమయంలో వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున 10 లక్షల మందితో బహిరంగ సభ చేపట్టారు.
దేశంలో సభలను నిర్వహించడం, వాటిని సక్సెస్ చేయడం ఒక్క కేసీఆర్ కే చేతనవుతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇదే క్రమంలో తన కూతురు అరెస్ట్ కావడం, తిరిగి బెయిల్ పై బయటకు రావడం జరిగింది. ఇప్పుడు తాను లేఖ రాయడం, బయటకు రావడం కలకలం రేపింది గులాబీ పార్టీలో. కేసీఆర్ ను కాదని ఎదురు నిలిచే నాయకుడు ఎవరూ ఆ పార్టీలో లేరు. ఈ సమయంలో లేఖ ఎలా లీక్ అయ్యిందనే దానిపై చర్చ జరుగుతోంది. దానికి ఇంటి దొంగలు ఎవరనేది త్వరలోనే తేలనుంది.