వంగా స్పిరిట్ మూవీలో త్రిప్తి దిమ్రీ

ప్ర‌భాస్ స‌ర‌స‌న ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు

అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తో స్పిరిట్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఆ మేర‌కు క‌థ కూడా సిద్దం చేశాడు. ఇదే స‌మ‌యంలో అంద‌రినీ విస్తు పోయేలా చేస్తూ ఏకంగా సూప‌ర్ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశాడు. వంగా ఎప్పుడైతే స్పిరిట్ ప్ర‌క‌టించాడో ఆనాటి నుంచి ఎవ‌రు హీరోయిన్ గా న‌టిస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. పెద్ద ఎత్తున దీపికా ప‌దుకొనే, ర‌ష్మిక మంద‌న్నా, త‌దిత‌ర న‌టీమ‌ణుల పేర్లు వినిపించాయి. చివ‌ర‌కు త‌నే సంచ‌ల‌న విష‌యం తాజాగా వెల్ల‌డించాడు.

యానిమ‌ల్ మూవీలో కీ రోల్ పోషించిన త్రిప్తి దిమ్రీని స్పిరిట్ కోసం హీరోయిన్ గా ఎంపిక చేసిన‌ట్లు తెలిపాడు వంగా సందీప్ రెడ్డి. కాగా మొద‌ట్లో దీపికా ప‌దుకొనేకు త‌న‌కు షూటింగ్ కు సంబంధించి 64 రోజులు కావాల‌ని కోరాడ‌ని, దీనికి త‌న కాల్ షీట్స్ కుద‌ర‌వ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా అట్లీ కుమార్ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న బ‌న్నీ మూవీలో త‌ను ఒప్పందం చేసుకుంద‌ని, అందుకే ప్ర‌భాస్ మూవీని విడిచి పెట్టిన‌ట్లు దీపికాపై ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

ఈ త‌రుణంలో ప్ర‌భాస్ స‌ర‌ప‌న , తెర‌ను పంచుకోబోయే ఆ అదృష్ట న‌టి ఎవ‌ర‌నే దానిపై ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రిగాయి. చివ‌ర‌కు త్రిప్తి దిమ్రీ ఖ‌రారు కావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com