టాలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక్క అంశం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అది డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య చోటు చేసుకున్న వివాదం గురించి. హైదరాబాద్ లో ఏపీ, తెలంగాణకు చెందిన వారందరూ ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు ఉమ్మడిగా. జూన్ 1 నుంచి తాము థియేటర్లను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తో పాటు సినీ రంగానికి చెందిన నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే సినిమాలు ఆడాలంటే థియేటర్లు కావాల్సిందే.
అయితే ఒక్కో థియేటర్ ను నిర్వహించాలంటే నెలకు కనీసం రూ. 5 లక్షలకు దాగా ఖర్చవుతోందని, ఆయా సినిమాల వల్ల తమకు నష్టం తప్ప లాభం రావడం లేదంటూ ఆరోపించారు. అంతే కాదు ఇక నుంచి సినిమాలు ప్రదర్శించాలంటే వసూళ్లైన వాటిలో తమకు సగం డబ్బులు ఇవ్వాలని, అప్పుడే థియేటర్లు ఓపెన్ చేస్తామంటూ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన కూడా చేశారు నిర్మాత ఎంఎం రత్నం. ఈ సమయంలో థియేటర్ల ఎలా మూసి వేస్తారంటూ నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చారు. తమకు ఆ నలుగురు నిర్మాతలతో సంబంధం లేదన్నారు బన్నీ ఫాదర్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ నలుగురు నిర్మాతలు ఎవరై ఉంటారని జోరుగా చర్చ జరుగుతోంది.
