సినిమాలలో ఛాన్సులు రావాలంటే లొంగి పోవాల్సిందేనా, శరీరాలను అప్పగించాల్సిందేనా..? అవునని అంటోంది సినీ నటి మౌనీషా చౌదరి. ఆమె సంచలన ఆరోపణలు చేసింది తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి. ఇక్కడ అవకాశాలు ఊరికే రావని పేర్కొంది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు వాపోయింది. ఈ మేరకు తను చిట్ చాట్ సందర్బంగా ఓ స్టార్ డైరెక్టర్ తన పట్ల ప్రవర్తించిన తీరు గురించి బయట పెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మనీషా చౌదరి వైరల్ గా మారారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
విచిత్రం ఏమిటంటే తన అనుభవం గురించి బయట పెట్టారు. ప్రముఖ దర్శకుడు తన తొడల గురించి కామెంట్ చేశాడని, వాటి సైజుల గురించి అడిగాడంటూ తెలిపింది మౌనీషా చౌదరి. చలన చిత్ర పరిశ్రమ చాలా మందికి అందంగా కనిపిస్తుందని, కానీ దాని వెనుక చాలా ఇబ్బందులు ఉంటాయని వాపోయింది. తను మొదటగా మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారింది. సదరు దర్శకుడితో చాలా ఇబ్బందులు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఓ టాలీవుడ్ దర్శకుకు నాకు ఫోన్ చేశాడు. తన సినిమాలో పాత్ర ఇస్తానని అన్నాడు. నాకు ఆసక్తి లేదని చెప్పాడు. ఇదే సమయంలో నా తొడల సైజు గురించి అనుచిత ప్రశ్నలు వేశాడని, నేను తొలుత షాక్ అయ్యాను. పాత్రకు తొడలకు సంబంధం ఏమిటో అర్థం కాలేదని అన్నది. అదే దర్శకుడు ఇప్పుడు స్టార్, అగ్ర నటులతో కలిసి పిన చేస్తున్నాడంటూ బాంబు పేల్చింది. కాగా మనీషా చౌదరి కన్నప్ప చిత్రంలో నటించింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎదుర్కొన్న ఇబ్బంది గురించి బయట పెట్టింది.
