ఆషికా రంగ‌నాథ్ కు బంప‌ర్ ఛాన్స్

మాస్ మ‌హారాజాతో న‌టించే ఆఫ‌ర్

టాలీవుడ్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుల‌లో ఒక‌రు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. త‌న జాన‌ర్ వేరే. మోస్ట్ ఎన‌ర్జ‌టిక్ గా ఉండే పాత్ర‌ల‌ను ఎంచుకుంటాడు. అది ఆయ‌న స్పెషాలిటీ. ముందు నుంచీ ద‌ర్శ‌క‌త్వ రంగంలో కొంత అనుభ‌వం ఉండ‌డం కూడా త‌న‌కు క‌లిసి వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ధ‌మాకా లో దుమ్ము రేపిన ర‌వితేజ ప్ర‌స్తుతం మాస్ జాత‌ర మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా కొన‌సాగుతోంది. దీనిని ఈ సమ్మ‌ర్ సీజ‌న్ లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు మూవీ మేక‌ర్స్. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో మ‌హారాజా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. త‌మ హీరో చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ త‌రుణంలో టాలీవుడ్ లో ఓ వార్త జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు ర‌వితేజ‌. ఆ కొత్త చిత్రానికి ద‌ర్శ‌కుడు కూడా అనౌన్స్ చేశాడు త‌నే. ఇప్ప‌టికే వినిపించిన క‌థ సూప‌ర్ గా ఉండ‌డంతో రెడీ అయ్యేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు కిషోర్ తిరుమ‌ల‌. ఈ మ‌ధ్య‌న అనిల్ రావిపూడి కామెడీ జాన‌ర్ లో సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో అదే స్టోరీ లైన్ లో మాస్ మ‌హారాజాతో డైరెక్ట‌ర్ ప్లాన్ చేసిన‌ట్లు టాక్.

ఇక ఇప్ప‌టికే ఓ హీరోయిన్ ను డిక్లేర్ చేశారు. త‌ను ఎవ‌రో కాదు రాబిన్ హుడ్ లో దుమ్ము రేపిన స్పెష‌ల్ సాంగ్ తో న‌టించిన కేతికా శ‌ర్మ‌. త‌న‌ను ఇప్ప‌టికే అనౌన్స్ చేయ‌డంతో ఇంకో హీరోయిన్ పాత్ర కోసం నా సామి రంగాలో అందంతో క‌ట్టి ప‌డేసిన ఆషికా రంగ‌నాథ్ ను ఖ‌రారు చేసిన‌ట్లు టాక్. ఇక త‌ను గ‌నుక తోడైతే ఈ సినిమా ఓ రేంజ్ లో ఉండ బోతోంద‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com