మంచు విష్ణు, అందాల భామ జెనీలియా దేశ్ ముఖ్ కలిసి నటించిన చిత్రం ఢీ. 2007లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ అయ్యింది. ప్రధానంగా న్వవులు పూయించడంలో టాప్ లో నిలిచింది. దీనికి దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల మంచి మార్కులు కొట్టేశాడు. ఎలాంటి అసభ్యత అన్నది లేకుండా చిత్రాన్ని రూపొందించాడు. నిర్మాతకు భారీగా డబ్బులు రాగా దర్శకుడి టేస్ట్ కు అందరూ ఫిదా అయ్యారు.
ఇక ఢీ చిత్రానికి వస్తే ఇందులో నటీ నటులంతా తల పండిన వారే. తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో నటించిన వారంతా ఇప్పటికీ ఉండగా ముగ్గురు మాత్రం ఈ లోకం నుంచి నిష్క్రమించారు. విష్ణుకు తండ్రి పాత్రలో నటించిన చంద్రమోహన్ , జెనీలియాకు ఫాదర్ గా నటించిన శ్రీహరి , జయప్రకాశ్ రెడ్డి దూరమయ్యారు. విష్ణు, జెనీలియాతో పాటు చారి పాత్రలో కమెడియన్ బ్రహ్మానందం ఇరగదీశాడని చెప్పక తప్పదు. ఇందులో తనది చారి పాత్ర.
బ్రహ్మితో పాటు మరో కమెడియన్ సునీల్ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్వించాడు. రౌడీ కూతురును కాపాడు కోవడం, అనుకోకుండా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన విష్ణు తన వద్ద పని చేయడం, ఇద్దరి మధ్య లవ్ కుదరడం, చివరకు ఏమైంది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అనేది తెలుసు కోవాలంటే ఈ ఢీ చూడాలి. మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనసారా నవ్వుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే.