దేశమంతటా అందాల ముద్దుగుమ్మ, ఎస్ఆర్ హెచ్ ఓనర్ , సీఈఓ కావ్య మారన్ , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ డేటింగ్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉండడం విస్తు పోయేలా చేసింది. ఒకరు సినీ రంగానికి చెందిన వారైతే ఇంకొకరు క్రికెట్ జట్టుకు ఓనర్ గా ఉండడం, మీడియా సంస్థను నడుపుతున్న అధిపతి. చిన్న వయసులోనే పలు కీలక సంస్థలకు సీఈఓగా పని చేయడం మామూలు విషయం కాదు. బహిరంగ మార్కెట్ పరంగా కావ్య పాప ఆస్తులు దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. ఇది పక్కన పెడితే అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ లు ఇద్దరూ గత ఏడాది నుంచే పీకల లోతు ప్రేమలో కూరుకు పోయినట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ తమిళ హీరో రజనీకాంత్ కు విషయం తెలిసిందని, ఇద్దరినీ పిలిచి మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇరు కుటుంబాలతో తనకు దగ్గరి అనుబంధం ఉంది. తనతో సన్ నెట్ వర్క్ సంస్థలు సినిమాలు తీస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ తో అట్లీ కుమార్ భారీ మూవీ తీస్తున్నారు సన్ పిక్చర్స్. ఏకంగా ఈ ఒక్క మూవీ కోసం రూ. 800 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందులో దీపికా పదుకొనే కీలక రోల్ పోషిస్తోంది. ఇది పక్కన పెడితే అటు మీడియా, ఇటు సినిమా, క్రికెట్ ,ఇలా ప్రతి రంగంలో సన్ నెట్ వర్క్ కు పేరుంది.
ఈ సంస్థ ఆసియా ఖండంలోనే అత్యంత జనాదరణ పొందిన మీడియాగా గుర్తింపు పొందింది. ఇక రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను ఎంటర్ అయ్యాడంటే సన్ నెట్ వర్క్ యజమానులు తప్పకుండా వినాల్సిందే. అనిరుధ్ రవిచంద్రన్ , కావ్య మారన్ లకు పెళ్లి చేయాలని స్పష్టం చేసినట్లు టాక్.