కొన్ని పాటలు మనల్ని హత్తుకునేలా చేస్తాయి. రా రమ్మంటూ పిలుస్తాయి. అక్కున చేర్చుకుంటాయి. ఈ మధ్యన స్పీడ్ పెరిగింది. సాహిత్యం అంతగా కనిపించడం లేదు. ఏదో రాస్తున్నాం..పాటలు పాటలుగా ఉండడం లేదు. జస్ట్ ఇచ్చామా విన్నారా అన్నది కూడా పట్టించు కోవడం లేదు సంగీత దర్శకులు. అయినా మంచి పాటలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా మేఘాలు చెప్పిన ప్రేమ కథ మూవీకి సంబంధించి ఒక మెరుపు మెరిసిందిప్పుడే అంటూ రిలీజ్ అయ్యింది . ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్ గుడ్ కల్పించేలా ఉంది. హాయిగా వినసొంపుగా ఉంది. చిత్రీకరణ కూడా హైలెట్ గా నిలిచింది. దీంతో సినిమాపై ఆసక్తిని రేపేలా చేసింది.
మరోసారి దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీబీ చరణ్ తన వాయిస్ తో కట్టి పడేశాడు. బాలూని జ్ఞాపకం తీసుకు వచ్చేలా చేశాడు. ఆ వాయిస్ లో చిలిపితనం అలాగే ఉండడం విశేషం. ఈ పాట వినగానే ఫీలింగ్ వచ్చేలా చేసింది. ప్రేమలో పడేలా చేసింది. విపిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో నరేష్ అగస్త్యతో పాటు రబియా ఖాతూన్ నటించారు.
ఈ మూవీకి సంబంధించి ఇటీవలే రెండు టీజర్స్ విడుదలయ్యాయి. మంచి జనాదరణ పొందాయి కూడా. ఈ పాటకు జస్టిన్ ప్రభాకర్ స్వర పరిచారు. రెహమాన్ ఈ పాటను రాశాడు. ఎస్పీబీ చరణ్ తో పాటు శాశా తిరుపతి – ఒక మెరుపు మెరిసిందిపుడే చిరునవ్వుగా, ఒక చినుకు కురిసిందిపుడే సిరిమువ్వగా.. చిరుగాలిలో చిగురాకులా ఊగిందిలే ఈ ప్రాణం – అంటూ హృద్యంగా పాడారు. నిరాశలో ఉన్న వాళ్లకు మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఉంది ఈ సాంగ్.
