కోల్ కతా – మాజీ మంత్రి కొడాలి నానిని కొల్ కత్తా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. తను కొల్ కతా నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళుతుండగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. తను చెప్పకుండా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండడంతో పట్టుకున్నట్లు తెలిపారు. తను గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తనతో పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సైతం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు .తను జైలులో ఉన్నారు.
ఈ ఇద్దరితో పాటు మాజీ మంత్రి పేర్ని నానికి మంగళగిరి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తనను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది. టీడీపీ నేతలకు సంబంధించిన కేసులో కోర్టుకు హాజరుకాక పోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో తన అరెస్ట్ కు కూడా రంగం సిద్దమైంది. ఇదిలా ఉండగా ఆనాడు జగన్ మోహన్ రెడ్డిని అడ్డం పెట్టకుని కొడాలి నాని రెచ్చి పోయాడు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను అమ్మనా బూతులు తిట్టాడు. కానీ పవర్ కోల్పోవడంతో తనకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇదే సమయంలో కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తను గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడని సమాచారం. ఆయనను హుటా హుటిన ఇటీవల ముంబై ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తను ఎక్కడికీ వెళ్లకుండా ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కూటమి సర్కార్ పవర్ లోకి వచ్చాక తనపై పలు కేసులు నమోదయ్యాయి.