కొన్ని సినిమాలు మనల్ని పిచ్చెక్కించేలా చేస్తాయి. మరికొన్ని వెంటాడుతుంటాయి. ఇంకొన్ని హృదయాల మీద చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి జానర్ లోకి వచ్చిన మూవీ 8 వసంతాలు. పూర్తిగా దర్శకుడు కవితాత్మకంగా ఉండేలా తీర్చి దిద్దడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దృశ్య పరంగా సూపర్ . ఇక కథా పరంగా భిన్నమైనది. ఇందులో అనంతిక సనిల్ కుమార్ కీ రోల్ పోషించింది. ఒక రకంగా తనే సినిమాను ముందుండి నడిపించిందని చెప్పక తప్పదు. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు మళ్లీ ఈ చిత్రంతో ముందుకు వచ్చాడు.
ఇక కథ పరంగా చూస్తే ఈ 8 వసంతాలు అనే మూవీ ఎనిమిది ఏళ్ల పాటు సాగే ప్రేమ కథ. ఒక మహిళ తన ప్రేమలో పడే పురుషుల ప్రయాణాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ సినిమా వాగ్ధానంతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సుందరమైన దృశ్యాలు, సున్నితమైన ప్రేమ కనిపిస్తుంది. ఊటీకి చెందిన ప్రముఖ రచయిత , మార్షల్ ఆర్టిస్ట్ అయిన శుద్దిని కథ అనుసరిస్తుంది.
ఆమె తన హృదయాన్ని గెలుచు కోవడానికి పుస్తకంలోని ప్రతి ఉపాయాన్ని ప్రయత్నించే ధనవంతుడైన వరుణ్‌ను కలుస్తుంది. అతని ప్రయత్నాలు ఫలించాయి – UC బర్కిలీలోకి ప్రవేశించడంలో అతని వైఫల్యం ఇద్దరూ విడి పోవడానికి దారితీస్తుంది. విజయ్ అనే మూడీ తెలుగు నవలా రచయిత, అతని మాటలు, కీర్తి నెమ్మదిగా శుద్దిని కొత్త ప్రేమలోకి లాగుతాయి.
చిత్రం పూర్తిగా రొమాంటిక్ డ్రామాగా నిలిచి పోయింది. కవితాత్మక పూరితమైన సంభాషణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల కోట్స్ లాగా అనిపిస్తాయి చూసే వారికి. ప్రత్యేకంగా చెప్పాల్సింది 8 వసంతాలు చిత్రానికి ప్రాణం పోసేలా చేసింది మాత్రం సినిమాటోగ్రఫీ అని చెప్పక తప్పదు. ఊటీ నుండి బెనారస్ వరకు అద్భుతంగా చిత్రీకరించారు. ఇది దర్శకుడి ప్రతిభకు దర్పణంగా నిలుస్తుంది.