ఉస్తామ్ భ‌గ‌త్ సింగ్ పై హ‌రీశ్ ఫోక‌స్

ప‌వ‌న్ క‌ళ్యాణ్..శ్రీ‌లీల కాంబినేష‌న్

ద‌మ్మున్న డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్. మాట‌ల‌తో మంటలు పుట్టించ‌గ‌ల‌డు. టేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. త‌ను కోరుకున్న‌ది తెర‌పై వ‌చ్చేంత దాకా వ‌దిలి పెట్ట‌డు. ఫెయిల్యూర్స్ ను ప‌ట్టించుకోడు. స‌క్సెస్ వ‌చ్చినా లైట్ గా తీసుకుంటాడు. త‌న‌దో డిఫ‌రెంట్ స్టైల్. త‌ను ఆ మ‌ధ్య‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తీసిన గ‌బ్బ‌ర్ సింగ్ ఇండియాను షేక్ చేసింది. టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపింది. నాకో తిక్కుంది దానికో లెక్కుంది..లాంటి డైలాగ్ లు ..పంచ్ లు దుమ్ము రేపాయి. సినిమాను ఓ రేంజ్ కు తీసుకు వెళ్లేలా చేశాయి. సినీ ఇండ‌స్ట్రీలో కేవ‌లం సంభాష‌ణ‌ల‌తో సినిమాల‌ను స‌క్సెస్ చేయించే ద‌మ్మున్న ద‌ర్శ‌కుల‌లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో పాటు హ‌రీశ్ శంక‌ర్ కూడా ఒక‌డు.

ఆ మ‌ధ్య‌న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. డ్రాగ‌న్ మూవీతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ తో ఓ సినిమా చేయాల‌ని ఉంద‌ని. త‌ను కూడా ఓకే చెప్పాడు. ఇది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం ఫుల్ ఫోక‌స్ పెట్టాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై. చాలా మంది వ‌స్తుందో రాదోన‌ని ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో, అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న పోస్ట్ చేశాడు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రెడీ అని ప్ర‌క‌టించాడు. దెబ్బ‌కు అనుమానాల‌కు తెర ప‌డింది. ఇప్పుడు షూటింగ్ లో బిజీగా ఉన్నారు ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఇటీవ‌లే ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకుంది. స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌య్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు. ఇవి వైర‌ల్ గా మారాయి. మొత్తంగా హ‌రీశ్ శంక‌ర్ పుట్టిన రోజు కంగ్రాట్స్ తెలిపాడు. త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ స్టార్ స‌త్తా ఏపాటిదో చూస్తారంటూ పేర్కొన్నాడు. ఎంతైనా హ‌రీశా మ‌జాకా అంటున్నారు ఫ్యాన్స్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com