పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరి హర వీరమల్లు. తన సినీ కెరీర్ లో ఈ సినిమా వాయిదా పడినంతగా ఇంకే సినిమా పడలేదని చెప్పక తప్పదు. ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ ఇప్పటి వరకు 13 సార్లు విడుదల తేదీ వాయిదా వేశారు. మొన్నటికి మొన్న ఇదిగో పవన్ మూవీ అంటూ ప్రకటించారు. తీరా ఊసురు మనిపించేలా చేశారు నిర్మాత ఎంఎం రత్నం. ఈ సినిమాను కొనేందుకు బయ్యర్స్ ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ పెద్దగా ప్రచారం జరిగింది.
ఇది పక్కన పెడితే టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. కొన్నేళ్లు పట్టింది హరి హర వీరమల్లు మూవీ పూర్తయ్యేందుకు. నానా తంటాలు పడ్డారు నిర్మాత రత్నం. దీనికి కారణం కథను సమకూర్చడమే కాదు దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి ఉన్నట్టుండి తప్పుకున్నాడు. తను ఎందుకు వైదొలిగాడన్నది ఎవరికీ ఇప్పటి వరకు తెలియలేదు. దర్శక, నిర్మాతలు ఎవరూ ప్రకటించలేదు.
గత్యంతరం లేక నిర్మాత తన సోదరుడి తనయుడు , దర్శకుడైన జ్యోతి కృష్ణను పెట్టి పని కానిచ్చేశాడు. ఇప్పటి వరకు హరి హర వీరమల్లు గురించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ విడుదల చేశారు. కానీ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో అసలు సినిమా వస్తుందో రాదోనన్న అనుమానం నెలకొంది. తాజాగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. సో వేచి చూడాలి. రిలీజ్ అవుతుందా మరో డేట్ కు వాయిదా పడుతుందా అనేది.