స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా మరోసారి సంచలనంగా మారారు. ఇండియాస్ గాట్ లాటెంట్ షో ద్వారా పేరు పొందాడు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది గతంలో దేశ వ్యాప్తంగా. నాలుగు నెలల విరామం తర్వాత వేరే నెట్ వర్క్ లో తిరిగి రావడంతో విస్మయానికి లోనయ్యారు. దీని కోసం తన జానర్ లో వెయిట్ చేస్తున్న వారికి ఒకింత సంతోషం కలిగించేలా చేసింది. ఈ షో సందర్బంగా పాడ్ కాస్టర్ రణవీర్ అల్లాబాడియా తో పేరెంట్స్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు సమయ్ రైనా. ఇది పెద్ద ఎత్తున రాద్దాంతానికి దారితీసింది. చట్ట పరమైన పరిణామాలకు దారితీసింది.
దీంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అలహాబాద్డియా, రైనా, అపూర్వ ముఖిజా, ఆశిష్ చంచలానీలపై ఆయా ప్రాంతాలలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. దీంతో వీరిందరిపై కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన అభ్యంతరాలు, ఆరోపణలు, విమర్శలు, కేసుల అనంతరం ఉన్నట్టుండి షోకు సంబంధించిన కీలకమైన భాగాలు తిరిగి ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. అయితే అసలు ఛానల్ ద్వారా కాకుండా మరో పేరుతో ఇవి వచ్చాయి.
ఇండియాస్ గాట్ లాటెంట్ క్లిప్స్ అనే దానితో అందుబాటులో ఉన్నాయి. ఇవి చూడాలని అనుకుంటే ఇందులో సభ్యులై ఉండాలి. ఇందులో లేదా చేరి ఉండాల్సి ఉంటుంది. ఈ పేజీ 500కు పైగా వీడియోలు కలిగి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 522 వీడియోలతో పాటు 4,93,000 మంది సబ్ స్క్రైబర్స్ కలిగి ఉన్నారు. అభిమానులు తెగ చూస్తున్నారు. మరింత ఆసక్తిని కనబర్చే ప్రయత్నం చేస్తున్నారు.