జ‌గ‌న్ రెడ్డి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై నిషేధం విధించాలి

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి డిమాండ్

అమరావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ అయ్యారు. మాజీ సీఎం జ‌గ‌న్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి మ‌ద్యం మాఫియా న‌డిపించాడ‌ని ఆరోపించారు. రైతుల‌ను న‌ట్టేట ముంచాడ‌ని వాపోయారు. వైఎస్సార్ ప‌నులు ప్రారంభించిన జ‌ల‌యజ్ఞం ముట్టు కోలేద‌న్నారు. 6 నెల‌ల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టు కోలేద‌న్నారు. ప‌ర్య‌ట‌న‌ల పేరుతో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

శుక్ర‌వారం వైఎస్ ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ రెడ్డి చేసిన బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ల వ‌ల్ల ముగ్గురు బ‌ల‌య్యార‌ని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. త‌ను ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్ట‌కుండా నిషేధం విధించాల‌ని కూట‌మి స‌ర్కార్ ను డిమాండ్ చేశారు. హత్యలు చేసిన వాళ్లు, చంపిన వాళ్ళు ఒప్పుకుంటారా అని ప్ర‌శ్నించారు. వివేకానంద రెడ్డి బాబాయిని హ‌త్య చేయించింది ఎవ‌రో మీకు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.
బాబాయిని చంపి సునీత మీద నెట్టివేసిన వాళ్ళకు సింగయ్య మృతి మీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్కా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు మోదీ జ‌పం త‌ప్పా ఇంకేం చేయ‌డం లేద‌ని మండి ప‌డ్డారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com