వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహించిన గణపత్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది భారతీయ హిందీ భాషా చిత్రం. పూర్తిగా యాక్షన్ ఓరియంటెండ్ గా ఉండేలా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. పూజా ఎంటర్ టైన్మెంట్ కింద జాకీ భగ్నాని, వాషు భగ్నాని , దీష్మిఖా దేశ్ ముఖ్ లతో కలిసి గణపత్ ను నిర్మించారు.
ఇందులో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ , కృతి సనన్ కీలక పాత్రలలో నటించారు.
యక్కంటి సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. రితేష్ సోని సంగీతం అందించారు. విశాల్ మిశ్రా, అమిత్ త్రివేది పాటలు రాశారు. వైట్ నాయిస్ స్టూడియోస్ సమర్పిస్తోంది. వచ్చే అక్టోబర్ 20న గణపత్ చిత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఇవాళ ప్రకటించారు.
భారీ బడ్జెట్ తో దీనిని తెరకెక్కించాడు దర్శకుడు వికాస్ బాహ్ల్. దాదాపు ఈ ఒక్క సినిమా కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్ లో టాక్.
ఈ మూవీ షూటింగ్ యుకె, లడఖ్ , ముంబైలలో జరిగింది. ప్రధాన లొకేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. దసరా పండుగ కానుకగా చిత్రం రానుంది.
