Kangana Tejas : కంగ‌నా తేజ‌స్ హ‌ల్ చ‌ల్

తేజస్ మూవీతో వైర‌ల్

పి. వాసు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చంద్ర‌ముఖి 2 ప్ర‌స్తుతం విడుద‌లై జ‌నాద‌ర‌ణ పొందుతోంది. ఈ చిత్రంలో కంగ‌నా ర‌నౌత్ కీల‌క పాత్ర పోషించింది. తాజాగా మ‌రో మూవీ తేజ‌స్ తో ముందుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు కంగ‌నాను అద్బుతంగా తెర మీద ప్ర‌జెంట్ చేశాడు.

ఇది భార‌తీయ వైమానిక ద‌ళ చ‌రిత్ర‌లో అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు, ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన ఓ మ‌హిళా పైల‌ట్ తేజ‌స్ గిల్ క‌థ‌. అసాధార‌ణ ప్ర‌యాణం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అనేక స‌వాళ్ల‌ను, ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ మ‌న దేశాన్ని అవిశ్రాంతంగా ర‌క్షించ‌డంలో ఎలాంటి పాత్ర పోషించిందో ఈ తేజ‌స్ మూవీలో చెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.

తేజ‌స్ గిల్ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగి పోయింది కంగ‌నా ర‌నౌత్. ఆమె న‌ట‌న సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. తేజ‌స్ కు స‌ర్వేష్ మేవారా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కంగ‌నా ర‌నౌత్ , అన్షుల్ చౌహాన్ , వ‌రుణ్ మిత్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈనెల 20న తేజ‌స్ మూవీ విడుద‌ల కానుంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com