తమిళ సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్లడ్ దుమ్ము రేపుతోంది. ఓ వైపు లోకేష్ కనగరాజ్ , నెల్సన్ దిలీప్ కుమార్, కార్తీక్ సుబ్బరాజ్ లు తమదైన స్టైల్ లో కమర్షియల్ సినిమాలతో రెచ్చి పోతుంటే మరో వైపు జ్ఞానవేల్ , పా రంజిత్ లాంటి వాళ్లు సామాజిక బాధ్యతతో కొత్త అంశాలను తెర మీద తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రజనీకాంత్ తో తీసిన కాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తలైవా కెరీర్ లోనే బిగ్ సక్సెస్ గా నిలిచింది.
తాజాగా ఏ పాత్ర ఇచ్చినా సరే దానిలో ఒదిగి పోయి ప్రాణం పోసే అరుదైన నటుడు విక్రమ్. తను మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ లో నటించి మెప్పించాడు. మరో పాత్రలో కార్తీ మెరిశాడు. ఇక గ్యాప్ తర్వాత త్రిష కృష్ణన్ మెరిసింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఇక తంగలాన్ చిత్రం విషయానికి వస్తే కర్ణాటకలోని కోలార్ లో జరిగిన యధార్థ కథ ఆధారంగా పా రంజిత్ దీనిని తీసే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఇది కెవ్వు కేక అనిపించేలా ఉంది. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి రిపబ్లిక్ డే రోజున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.