Chandra Mohan SPB : ప్రముఖ విలక్షణ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. ఇక రాడు. ఒకటా రెండా ఏకంగా 938 కు పైగా సినిమాలలో నటించారు. హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం అంటే చంద్రమోహన్(-Chandra Mohan) కు చచ్చేంత ఇష్టం. తనను సోదరుడి కంటే ఎక్కువగా ప్రేమించారు.
Chandra Mohan SPB Memories
తనకంటే ముందు ఎస్పీబీ చని పోవడంతో తట్టుకోలేక పోయారు. బాలూ నన్ను విడిచి ఎలా వెళ్లి పోయావురా అంటూ కంటతడి పెట్టారు. నీకంటే ముందే నన్ను తీసుకు పోయి ఉంటే బావుండేదంటూ బావురుమన్నాడు చంద్రమోహన్.
ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినా ఎక్కడా భేషజాలు ప్రదర్శించ లేదు. ఏది ఏమైనా తెలుగు సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. తండ్రి పాత్రలో లీనమై పోయి నటించారు. 2000 నుంచి నేటి దాకా విడుదలైన చాలా సినిమాలలో చంద్రమోహన్ మెప్పించారు.
ఆయనకు ఎక్కువగా పేరు తీసుకు వచ్చేలా చేసింది కె.విశ్వనాథ్ తీసిన సిరిసిరిమువ్వ. వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం తోడైంది. తనకు గుర్తింపు తీసుకు వచ్చింది.
Also Read : Captain Miller Movie : కెప్టెన్ మిల్లర్ పై ఉత్కంఠ
