Tripti Dimri: రవితేజ సరసన ‘యానిమల్‌’ బ్యూటీ..!

రవితేజ సరసన ‘యానిమల్‌’ బ్యూటీ..!

Hello Telugu - Tripti Dimri

Tripti Dimri : ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఘోర పరాజయం చూసిన మాస్ మహారాజ్ రవితేజ… తరువాత సినిమాల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. హిట్టా ఫట్టా అని సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్‌’ సినిమాలో రవితేజ నటిస్తున్నారు. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ లు నటించగా… ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 విడుదల కానుంది.

దీనితో పాటు గోపిచంద్‌ మలినేనితో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గోపిచంద్ర మలినేని సినిమాతో పాటు అనిల్ రావిపూడితో కూడా సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. దీనితో అనిల్ రావిపూడి సినిమాలో రవితేజ సరసన ‘యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Tripti Dimri – అనిల్ రావిపూడి సినిమాలో రవితేజ సరసన త్రిప్తి డిమ్రి !

అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా తెరకెక్కించిన తాజా సినిమా ‘యానిమల్‌’. రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్నా మొదటి హీరోయిన్ గా నటించగా సెకండ్ హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి నటించింది. ‘యానిమల్‌’ సినిమాతో త్రిప్తి డిమ్రి ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆమె పేరే కనిపిస్తోంది. దీనిలో భాగంగా త్రిప్తి డిమ్రికి… టాలీవుడ్‌ లో కూడా అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. రవితేజ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో త్రిప్తి డిమ్రి ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల టాక్. అయితే ఈ విషయం గురించి అటు త్రిప్తి డిమ్రి నుండి గాని ఇటు చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

Also Read : Animal: ‘బాహుబలి’ ని క్రాస్ చేసిన ‘యానిమల్‌’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com