తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ శ్రీలీల టాప్ లో కొనసాగుతోంది. ఈ లవ్లీ గర్ల్ పై దర్శకేంద్రుడి కన్ను పడడం ఆ వెంటనే పెళ్లి సందడి మూవీలో నటించడం జరిగి పోయింది.
ఆ తర్వాత వరుస మూవీస్ తో బిజీగా మారి పోయింది. అతి తక్కువ సమయంలోనే అగ్ర స్థానానికి చేరుకుంది. అంతే కాదు ఇప్పుడు ఆమె ఎంత కోరితే అంత ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారంటే ఆమె రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఆమె చేతిలో తాజాగా పలు సినిమాలు ఉన్నాయి. నట సింహం నందమూరి బాలయ్య బాబుతో నటిస్తోంది. భగవంత్ కేసరిలో నటించి మెప్పించింది. దీనికి దర్శకుడు అనిల్ రావి పూడి. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కందలో దుమ్ము రేపింది శ్రీలీల
. రామ్ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్సులతో హోరెత్తి పోయింది. అది కూడా సక్సెస్ బాట పట్టింది. మరో వైపు ప్రిన్స్ మహేష్ బాబుతో గుంటూరు కారంలో నటిస్తోంది.
తాజాగా వైష్ణవ్ తేజ్ తో కలిసి ఆదే కేశవ్ సినిమాలో నటిస్తోంది. ఇందుకు సంబంధించిన సాంగ్ ఇవాల విడుదలైంది. ఫోటోలు కిర్రాక్ అనిపించేలా ఉన్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. దీనిని రామ జోగయ్య శాస్త్రి రాశారు.
