బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ పై ఆయన తీవ్రంగా స్పందించారు. తాను పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ తాను పూర్తిగా సెక్యులర్ వాదినని స్పష్టం చేశాడు. ఈ సందర్బంగా తన ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నాడు. నా సోదరీమణులు, కూతురు హిందువులను పెళ్లి చేసుకున్నారంటూ చెప్పాడు . ప్రస్తుతం తను సితారే జమీన్ పర్ మూవీలో జెనీలియా దేశ్ ముఖ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు నటుడు.
ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ తన 2014లో నటించిన పీకే చిత్రం గురించి కీలక కామెంట్స్ చేశాడు. ఆనాడు చోటు చేసుకున్న వివాదం గురించి ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా మత వ్యతిరేకత లేదా లవ్ జిహాద్ ను ప్రోత్సహించిందనే వాదనలను తిరస్కరించాడు అమీర్ ఖాన్. చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని భావాలను పంచుకున్నాడు.
కళా రంగంలో పని చేసే వారికి కుల, మతాలంటూ ఏవీ ఉండవన్నాడు. తామందరి కులం ఒక్కటేనని, అది సినిమా కులమని పేర్కొన్నాడు అమీర్ ఖాన్. అన్ని కులాలను, మతాలను, వర్గాలను, మతస్తులను ఒకే రకంగా చూస్తామన్నాడు. వారిని గౌరవిస్తామని తెలిపాడు. అయితే సామాన్యులను మోసం చేసే వ్యక్తులు ప్రతి చోటా ఉంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మాత్రమే పీకే సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశామన్నాడు.